Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆశ్వథ్థామ క్రైమ్ థ్రిల్లరా?.. ఆసక్తి కరంగా మారిన మోషన్ పోస్టర్
యంగ్ హీరో నాగ శౌర్య డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చాక్లెట్ బాయ్‌లా ఉన్న ఈ హీరో.. యాక్షన్ చిత్రాలనూ ఎంచుకుంటున్నాడు. ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టిన నాగశౌర్య.. ఆ రేంజ్ విజయాన్ని మళ్లీ అందుకోలేకపోయాడు. ఛలో చిత్రంతో నిర్మాతగా మారి ఐరా క్రియేషన్స్‌ను స్థాపించిన నాగశౌర్య మొదటి చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. మరోసారి తన స్వంత నిర్మాణ సంస్థలో రెండో చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
అశ్వథ్థామ అంటూ టైటిల్ పెట్టి ఆసక్తిని రేకెత్తించిన చిత్రయూనిట్ తాజాగా ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే ఎన్నో అనుమానాలు, ఆలోచనలు వస్తున్నాయి. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అయిండొచ్చని తెలుస్తోంది. ఓ అమ్మాయి రోడ్డు మీద నడుస్తూ ఉండటం, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు.. హీరో ఎవరినో తరుముతున్నట్లు కనిపిస్తోంది. అందర్నీ ఆకర్షించాలనే చిత్రయూనిట్ ప్రయత్నం మాత్రం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. రమణ తేజ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.