For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna Vrinda Vihari: రొమాంటిక్ సీన్లతో కృష్ణ వ్రింద విహారి టీజర్.. వర్జినేనా అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో క్యూట్ లుక్స్‌తో మాయ చేస్తోన్న నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం అందుకున్నాడతను. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, ఇందులో చాలా వరకూ అతడికి నిరాశనే మిగిల్చాయని చెప్పాలి.

  RRR 3 Days Collections: సండే అన్ని కోట్లతో అరాచకం.. 453 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో వచ్చిందెంతంటే!

  వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా నాగశౌర్యకు చాలా కాలం పాటు పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన కథలతో విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం 'అశ్వద్ధామ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేశాడు. ఇది హిట్ అవడంతో పాటు అతడిని హీరోగా మరో మెట్టుపై నిలబెట్టింది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా గత ఏడాది లక్ష్మీ సౌజన్య అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించిన 'వరుడు కావలెను' అనే సినిమాను చేశాడు. అలాగే, ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్‌లో 'లక్ష్య' చేశాడు. ఇవి కూడా అంతగా ఆడలేదు.

  Naga Shauryas Krishna Vrinda Vihari Movie Official Teaser Released

  ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అయిన నాగశౌర్య ప్రస్తుతం మరో సినిమాను చేస్తున్నాడు. అతడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇటీవలే రివీల్ చేశారు. ఇక, దీనికి 'కృష్ణ వ్రింద విహారి' అనే పేరు పెట్టారు. అలాగే, ఇందులో నాగశౌర్య ఫస్ట్ లుక్‌ను కూడా చూపించారు. నుదిటిన పొడవాటి బొట్టు పెట్టుకుని, చేతిలో రాగి చెంబు పట్టుకుని, మామిడి ఆకులతో నీళ్లు చల్లుతున్నట్లు అతడిని చూపించారు. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఈ సినిమా షూటింగ్‌ను కూడా శరవేగంగానే జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ పూర్తి చేసుకున్నారు.

  Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. 'ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

  'కృష్ణ వ్రింద విహారి' మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా వరకూ పూర్తి కావడంతో యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలను కూడా చూపించారు. అలాగే, 'నువ్వు వర్జిన్‌వేనా' అనే డైలాగ్‌ కూడా పెట్టారు. దీంతో ఈ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా యూత్‌ నుంచి దీనికి మంచి స్పందన దక్కుతోంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఈ టీజర్ వైరల్‌గా మారిపోయింది.

  ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'కృష్ణ వ్రింద విహారి' సినిమాను అనీష్ కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాగశౌర్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో షెర్లీ సెతియా ఒకరు కాగా.. మరొక హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఇక, ఈ సినిమాను నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  English summary
  Young Hero Naga Shaurya Doing Krishna Vrinda Vihari Movie Under Annish Krishna Direction. Now This Movie Official Teaser Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X