For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nagababu: నరేష్ వల్లే 'మా'లో గొడవలు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుదామనుకున్నాడు.. జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ?

  |

  సినీ నిర్మాత, నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూనే జబర్ధస్త్ షోలో చాలా కాలంపాటు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నాగబాబు.. మెగా ఫ్యామిలీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టడంలో ముందుంటారు. అందుకు ఉదాహరణ ఇటీవల చిరంజీవిపై గరికపాటి మాట్లాడిన కామెంట్స్ కు ఆయన స్పందించిన విధానమే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు.. మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎలక్షన్స్ గురించి, సీనియర్ నటుడు నరేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ..

  విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ..

  గతేడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓవైపు ప్రకాష్ రాజు, మరోవైపు మంచు విష్ణు పోటీలో నిలుచున్నారు. ఎన్నికల్లో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ ని రసవత్తరంగా మార్చారు. చివరికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది. అయితే ఈ ఎన్నికల గురించి, అందులో సీనియర్ నటుడు నరేష్ పాత్ర గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  మైనస్ అయి కూర్చున్నాడు..

  మైనస్ అయి కూర్చున్నాడు..

  ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అంత చేతకానీ ప్రెసిడెంట్, లిటిగేషన్ ఉన్న ప్రెసిడెంట్ లేరు. తను మా అసోసియేషన్ కు ప్లస్ కాకపోయినా పర్వాలేదు గానీ, మైనస్ అయి కూర్చున్నాడు. ఏం జరిగిన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పేయటం చేశాడు. ఆ విషయాలు ప్రజలకు అవసరమా.. ఈ కంపు చేసిన తర్వాత మాకు వేరే ఆప్షన్ లేదు. మేం మాట్లాడాల్సి వచ్చింది.

  కెపాసిటీకి మించి ఆలోచిస్తాడు..

  కెపాసిటీకి మించి ఆలోచిస్తాడు..

  నాకు తెలిసినంతవరకు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం మోహన్ బాబు గారికి కానీ, విష్ణుకి కాన లేదని నా ఉద్దేశ్యం. కానీ నరేష్ వాళ్లకు లేనిపోనివి చెప్పాడని మాకు సమాచారం ఉంది. మళ్లీ నరేష్ తన కెపాసిటీకి మించి ఆలోచిస్తాడు. తాను దైవాంశ సంభూతుడనే భ్రమలో ఉంటాడు. అందుకనే కృష్ణుడి పాత్ర చేశాను. చక్రం తిప్పుతున్నానని అన్నాడు. అతనికి అదొక రకమైన మానసిక జబ్బు.

   మా లో గొడవలు క్రియేట్ చేసి..

  మా లో గొడవలు క్రియేట్ చేసి..

  నరేష్ అతన్ని తప్పా ఇంకొకరిని ఇష్టపడడు. గౌరవించడు. శివాజీ రాజాపై గోల చేశాడు. తర్వాత జీవితను కలుపుకుని వెళ్లాడు. ఇప్పుడు ఆమెతో గొడవ. ఇలా అందరితోనూ అతనికి గొడవలు ఉన్నాయి. మా లో గొడవలు క్రియేట్ చేసి తద్వారా తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అవ్వాలని అనుకున్నాడు. కానీ అవన్నీ జరగలేదు. ప్రస్తుతం జబర్దస్త్ కి నాకు విభేదాలు ఏం లేవు. వాళ్లు ఆహ్వానిస్తే తప్పుకుండా మళ్లీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా''.

   నా నోటితో పలకడం కూడా ఇష్టం లేదు..

  నా నోటితో పలకడం కూడా ఇష్టం లేదు..

  జనసేన పార్టీపై వచ్చే విమర్శల గురించి.. ''కొంతమంది చేసే విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు. పోసాని మురళి లాంటి వ్యక్తుల పేర్లు నా నోటితో పలకడం కూడా ఇష్టం లేదు. రాజకీయంగా చేసే విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాధానం చెబుతారు. అందుకే తాను కలుగజేసుకోవట్లేదు'' అని నాగబాబు ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Producer Actor Nagababu Sensational Comments On Actor VK Naresh Over MAA Elections And About Jabardasth Re Entry
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X