For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మా' పోరులో ప్రకాష్ రాజ్ కి బిగ్ సపోర్ట్.. జనసేనను లాగుతూ నాగబాబు కామెంట్స్!

  |

  టాలీవుడ్ లో ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రచ్చ రేపుతోంది. మా అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు పోటీపడుతున్నారు.. ఇద్దరూ బలమైన వ్యక్తులు కావడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. అయితే ప్రకాష్ రాజ్ కి అనూహ్యంగా నాగబాబు నుంచి మద్దతు రావడం ఆసక్తికరంగా మారింది. అంతే కాక జనసేన గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

   ప్రకాష్ రాజ్ vs విష్ణు

  ప్రకాష్ రాజ్ vs విష్ణు

  మా అధ్యక్షుడు రేసులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, కుర్ర హీరో విష్ణు దిగారు. ఇప్పటికే కొడుకు కోసం రంగంలోకి దిగిన మోహన్ బాబు సూపర్ స్టార్ కృష్ణను కలిసి తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటిదాకా ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కానప్పటికీ మా అధ్యక్షుడు పదవి కాలం పూర్తి కావస్తుండడంతో ఇప్పటికే సందడి మొదలైపోయింది.

   ఇద్దరూ బలమైన వ్యక్తులే

  ఇద్దరూ బలమైన వ్యక్తులే


  అయితే ఇప్పుడు అధ్యక్ష పదవి బరిలో ఉన్న ఇద్దరూ బలమైన వ్యక్తులే కావడం, ఇద్దరికీ సినీ రంగంలో మంచి పరిచయాలు ఉండడం, అందరితో సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నిన్న కృష్ణతో కలిసి మోహన్ బాబు విష్ణుకి మద్దతు తెలపాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  చిరంజీవి మద్దతు ఎవరికి

  చిరంజీవి మద్దతు ఎవరికి


  నిజానికి మా అధ్యక్ష ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిరంజీవి ఎవరికి మద్దతు ఇస్తే, లేదా చిరంజీవి కుటుంబం వారు ఎవరికి మద్దతు ఇస్తే వారు అధ్యక్ష పదవి అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. గత అనుభవాలు ఈ విషయాన్ని రూడీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తాను చిరంజీవి మద్దతుతోనే బరిలోకి దిగానని ప్రకాష్ రాజ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

  ఇద్దరూ క్లోజే

  ఇద్దరూ క్లోజే

  ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిరంజీవితో మోహన్ బాబు చాలా సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. పుట్టిన రోజు అలాగే ఇతర ముఖ్యమైన రోజులకు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం మొదలు మోహన్ బాబు చేస్తున్న సినిమాకు చిరంజీవి మాట సాయం చేయడం దాకా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి పోయింది. దీంతో ఇప్పుడు చిరంజీవి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

  నాగబాబు మద్దతు

  నాగబాబు మద్దతు


  అయితే ఈ రోజు అనూహ్యంగా నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ కి మద్దతు పలికారు. ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ బాబు ప్రకాష్ రాజ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఆయన నాన్ లోకల్ అని వస్తున్న అన్ని విమర్శల గురించి స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఒక భాషకు సంబంధించిన వ్యక్తి కాదని దేశం మొత్తం ఖ్యాతి గడించాడు అని చెప్పుకొచ్చారు.

  Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
  అప్పుడు తిట్టి ఇప్పుడు సపోర్ట్

  అప్పుడు తిట్టి ఇప్పుడు సపోర్ట్

  ప్రాంతాలు వేరైనప్పటికీ అందరూ నటులమే కదా అని చెప్పుకొచ్చారు. అందరి దాకా ఎందుకు మా ఇంట్లోనే అన్నయ్య కాంగ్రెస్ లో ఉన్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ ఉంది. వారిద్దరి ఐడియాలజీ మాత్రమే వేరు, అంతమాత్రాన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కాకుండా పోతారా అని ప్రశ్నించారు. తను సినిమాలు చేస్తున్న తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని ఆయన ఆలోచన చేయడం నచ్చిందని అన్నారు. ఇక జనసేనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసినందుకు గత ఏడాది ప్రకాష్ రాజ్ మీద ఫైర్ అయిన మెగా బ్రదర్ ఇలా మద్ధతునివ్వడం ఆశ్చర్యపరిచే అంశమే.

  English summary
  Naga Babu extended his support for Prakash Raj’s run for MAA presidentship. in an interview he made some intresting comments regarding this issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X