For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిహారిక వ్యవరహారం మీద స్పందించిన తల్లి.. మాకేం కాదు బావగారు ఉన్నారంటూ!

  |

  మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది. పూర్తిస్థాయి హోమ్లీ పాత్రలకు పరిమితమైన ఆమె హీరోయిన్ గా కొనసాగ లేకపోవడంతో నిర్మాతగా మారి వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలు పంచుకొంది. పెళ్లి మొదలు ఆమె అనేకమార్లు వార్తల్లోకి వస్తూనే ఉంది. ఇటీవల ఆమె పబ్ వ్యవహారంలో కూడా వార్తల్లోకెక్కింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా నిహారిక గురించి ఆమె తల్లి పద్మజా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నిహారికకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆమె పంచుకున్నారు.

  మీడియాలో ఫోకస్

  మీడియాలో ఫోకస్

  ఉగాది రోజున అనూహ్యంగా నిహారిక వార్తల్లోకెక్కారు. సరిగ్గా ఉగాది రోజు హైదరాబాద్ లో ఒక పబ్ లో పోలీసులు దాడులు చేశారు. అయితే ఆ పబ్ లో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం పోలీసులకు అందడం, అదే పబ్లో నిహారిక ఉండడంతో పెద్ద ఎత్తున ఈ విషయం మీద చర్చ జరిగింది. సాధారణంగానే సినీ సెలబ్రిటీలు అంటే మీడియా ఫోకస్ అంతా వారి మీద ఉంటుంది. కాబట్టి నిహారిక పేరు కూడా రెండు మూడు రోజులు గట్టిగానే మీడియాలో ఫోకస్ అయింది.

  బాధగా అనిపించేది అని

  బాధగా అనిపించేది అని


  అదే సమయంలో ఆమె సోషల్ మీడియాలో కూడా తన అకౌంట్లో డి ఆక్టివేట్ చేయడంతో ఆ విషయం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. కొద్దిరోజుల క్రితమే ఆమె సోషల్ మీడియా లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక మదర్స్ డే సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు నిహారిక తల్లి పద్మజ, నిహారిక ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోనే అనేక విషయాలను తల్లీకూతుళ్లు పంచుకున్నారు. నిహారిక సినీ పరిశ్రమలో వచ్చిన మొదట్లో ఆమె మీద వచ్చే వార్తలు విని బాధగా అనిపించేది అని పద్మజా వెల్లడించారు.

   బాధ గా అనిపించదు

  బాధ గా అనిపించదు

  అసలు నిహారిక గురించి బయట వార్తలు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది అని అడిగితే మాకు ఉన్న దాంట్లో ఎవరు ఏం చేయలేరు అలా అంటే ఇంట్లో తలుపులు వేసుకుని ఉండాలి మనం తప్పు చేయనంతవరకు ఏ విషయంలోనూ బాధపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా నాకు ఏమీ పెద్దగా బాధ గా అనిపించదు అని ఆమె అన్నారు.

  మాకేం పర్వాలేదు

  మాకేం పర్వాలేదు

  ఎందుకంటే మేమేమిటో మాకు తెలుసు, మా కూతురు ఏంటో నాకు తెలుసు బయట వాళ్ళు, బయట వాళ్ళు లాగానే చూస్తారు అని ఆమె అన్నారు. ఇప్పుడు ఎవరైనా బావుంటే వారి మీద రాయి వేయాలని, మనసు కష్టపెట్టాలని చూస్తుంటారు కానీ నాకైతే నిహారిక విషయంలో ఎలాంటి టెన్షన్ లేదని అన్నారు, అంతేకాక మాకు మా బావగారు ఉన్నారన్న ఆమె మా బావగారు ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు.

   కొట్టేస్తాం కదా

  కొట్టేస్తాం కదా


  నిహారిక భర్త చైతన్య కూడా చాలా అర్థం చేసుకునే మనిషి అని ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని అన్నారు. ఈ వార్తల వ్యవహారం మీద నిహారిక స్పందిస్తూ అసలు తాను వార్తలు చూడనని మరీ ముఖ్యంగా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో వచ్చే కామెంట్స్ కూడా పట్టించుకోనని అని అన్నారు. మా గురించి ఏమైనా రాసుకోండి ఎన్నయినా రాసుకోండి నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరైనా వెనుక మాట్లాడాల్సిందే కానీ మన ముందుకు వచ్చి మాట్లాడితే మనం కొట్టేస్తాం కదా అంటూ సరదాగా నిహారిక పేర్కొంది.

  English summary
  nagababu wife padmaja responded on niharika pub issue in a interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X