For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Loser 2 వెబ్ సిరీస్ తీయాలంటే ఈజీ కాదు.. OTT అంటే రెవల్యూషన్.. నాగార్జున అక్కినేని క్రేజీ స్పీచ్

  |

  ప్రేక్షకులకు వినోదం అందించడంలో Zee 5 OTT తనదైన శైలిలో దూసుకెళ్తున్నది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ లూజర్‌ ప్రేక్షకులను మెప్పించింది.

  ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది'. ఆ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'లూజర్ 2ను తీసుకువస్తున్నది. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. 'లూజర్ 2'కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో లూజర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. లూజర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, బ్యాట్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ 5 హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.

  Nagarjuna Akkineni about Loser 2 web series on Zee 5 OTT

  అనంతరం కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ఆడియన్స్ ను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి మెప్పిస్తూ వినోదాన్ని అందించాలి. అయితే ఓటీటీలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. సినిమా లాగా పూర్తి స్థాయి వినోదాన్ని అందించాలి. లూజర్ వెబ్ సిరీస్ ఆడియన్స్‌ని థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. లూజర్ 2 ట్రైలర్ చూశాను. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే యూనిట్ సక్సెస్ అయినట్టు కనిపించింది. ఈ నెల 21 న లూజర్ 2 వెబ్ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. లూజర్ 2 యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అని నాగార్జున అన్నారు.

  Nagarjuna Akkineni about Loser 2 web series on Zee 5 OTT

  అలాగే భారతదేశం గర్వించదగిన గొప్ప ప్లేయర్ చేతన్ ఆనంద్. అన్నపూర్ణ గురించి చెప్పాలంటే సినీ పరిశ్రమకు ఎడ్యుకేషన్ లేదన్న నాన్న గారి ఆలోచన నుండి పుట్టినదే ACFM. అందుకే ఈ కాలేజ్ నుంచి ఎంతో మంది నటులు, సాంకేతిక నిపుణులు చదువుకొని మంచి పేరు తెచ్చు కుంటున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియో‌లో మంచి టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం. అలాగే జీ 5 స్టూడియోతో మా ట్రావెల్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. జీ 5 హోల్ టీం అనురాధకు, నిమ్మకాయల ప్రసాద్, తదితరులందరికీ మా ధన్యవాదాలు. సుప్రియ కూడా చాలా కష్టపడి ఎంతో డెడికేటేడ్‌గా వర్క్ చేస్తుంది. ఈ చిత్రానికి పని చేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్. లూజర్ 2 గా వస్తున్న ఈ సిరీస్‌కు ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం ను ఆశీర్వదించాలని అన్నారు.

  నటీనటులు: ప్రియ‌ద‌ర్శి, ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, క‌ల్పికా గణేష్, షాయాజీ షిండే, శ‌శాంక్‌, హ‌ర్షిత్ రెడ్డి, సూర్య‌, పావ‌నీ గంగిరెడ్డి, స‌త్య కృష్ణ‌న్ శ్రీ‌ను, టిప్పు, తదితరులు
  రచన: సాయి భరద్వాజ్, శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి
  ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ
  క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల
  కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ
  కూర్పు: కుమార్ పి. అనిల్‌
  ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై
  సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి
  ద‌ర్శ‌క‌త్వం: శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి
  ప్రొడ‌క్ష‌న్‌: జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌

  English summary
  After huge success of Loser web series, Unit planned for Loser 2. This web series is to release on ZEE 5 OTT on January 21st. In this occassion, Nagarjuna speaks emotionally in its pre release event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion