twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇబ్బందుల్లో ఇరుక్కోవడం మంచిది కాదు.. అందుకే ఆ ప్రయత్నం చేశా: నమ్రత శిరోద్కర్

    |

    దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ కరోనాకు మందులు లేకపోవడం కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం మాత్రమే కరోనా కట్టడికి సరైన మార్గాలు అనిచెబుతున్నాయి ప్రభుత్వాలు. ఈ మేరకు ఇంట్లోనే ఉంటూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ మహేష్ సతీమణి నమ్రత 'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్' విసిరిన సంగతి తెలిసిందే.

    తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ 'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్' గురించి మాట్లాడింది నమ్రత. ఇలాంటి సమయంలో సొసైటీకి గైడెన్స్‌ చాలా అవసరం. అందుకే ఓ వీడియో చేసి సోషల్‌ మీడియా వేదికగా 'సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌' విసిరానని నమ్రత చెప్పింది. దగ్గు, తుమ్ముల వల్ల కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ కాబట్టి శుభ్రత, సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యమని మరోసారి ఆమె పేర్కొంది.

    Namrata Shirodkar reaction on Safe Hands Challenge

    చేతుల్ని తరచూ 20-30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలని, కనీసం అభిమానులు ఈ వీడియో చూసినా అది వేల మందికి చేరుతుందనే నమ్మకంతో చేసిన ప్రయత్నమే ఈ సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌ అని నమ్రత తెలిపింది. అలాగే ఇది తన వంతు బాధ్యత అనుకున్నానని చెప్పుకొచ్చింది.

    ప్రస్తుత పరిస్థితుల్లో భయపడుతూ ఇబ్బందుల్లో ఇరుక్కోవడం, అశ్రద్ధ చేయడం మంచిది కాదని పేర్కొన్న నమ్రత.. ముక్కు, నోటికి మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పింది. అలాగే కరోనా వైరస్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పేర్కొంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య, పోలీస్‌, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె తెలిపింది.

    English summary
    CoronaVirus expanding world wide. In this situation Namrata Shirodkar challenges with her instagram post. Now she reacted on this challenge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X