Nandamuri Balakrishana బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ.. హిందీలోకి అఖండ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన విజయాన్ని అందుకొన్న అఖండ చిత్రం హిందీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం దక్షిణాదిలో బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. దాదాపు ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే కొద్దికాలంగా తెలుగు సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలో కార్తీకేయ2, కాంతార, సీతారామం, గాడ్ ఫాదర్ సినిమాలు హిందీలో రిలీజ్ కావడంతో అఖండ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాల రిలీజ్ కొరత ఉండటంతో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Nandamuri Balakrishnas Akhanda to release in Hindi Version, Release date is here

అఖండ హిందీ వెర్షన్ ద్వారా నందమూరి బాలకృష్ణ నేరుగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. అఖండ హిందీ వెర్షన్ చిత్రం జనవరి 20వ తేదీన ఉత్తరాదిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రంగం సిద్దంచేశారు. ఈ సినిమాను రిలీజ్ డేట్‌ను జనవరి 17వ తేదీన అధికారికంగా ప్రకటించారు.

Nandamuri Balakrishnas Akhanda to release in Hindi Version, Release date is here

ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ తదితరులు నటించిన అఖండ చిత్రాన్ని హిందీలో సాజిద్ ఖురేషి నిర్మాతగా పెన్ స్టూడియోస్ బ్యానర్‌కు చెందిన జయంతిలాల్ గడా సమర్పించి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సినిమాపై ఉత్తరాదిలో మంచి క్రేజ్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాను. ఇటీవల హిందు పురాణాలు, దేవతలు, భక్తి నేపథ్యం ఉన్న చిత్రాలకు బాలీవుడ్ భారీ రెస్సాన్ లభిస్తున్నది. అయితే అఖండ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X