జమున గారికి మరణం లేదు.. నాన్నగారు చెప్పినట్టు అంటూ బాలకృష్ణ ఎమోషనల్
వెండితెరపై సత్యభామగా, అల్లరి అమ్మాయిగా, సాంఘీక, పౌరాణిక చిత్రాల్లో అద్బుతమైన నటనను ప్రదర్శించిన జమున ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జనవరి 27 తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె మరణవార్తతో సినీ పరిశ్రమ తల్లడిల్లిపోయింది. ఆమె మృతివార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ విషాద సమయంలో నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సంతాపాన్ని తెలియజేస్తూ..
అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు.
కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు... నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు.. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి... వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.

తెలుగు సినిమా పరిశ్రమలో జమున తన కెరీర్‌లో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, జమున జోడి హిట్ పెయిర్‌గా నిలిచింది. వారిద్దరి జోడికి తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఎన్టీఆర్‌తో దాదాపు 30 సినిమాల్లో నటించారు. సత్యభామగా ఎన్టీఆర్‌తో పోటీపడి నటించారు.
పుట్టిల్లుతో కెరీర్ ప్రారంభించిన జమున.. ఆ తర్వాత నిరుపేదలు, వద్దంటే డబ్బు. దొంగ రాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతి అనసూయ, ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు. మూగ మనుషులు, రాముడు భీముడు, దొరికితే దొంగలు. ఆమె నటించిన చివరి చిత్రం బాహుబలి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











