For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌కు బాలయ్య సాయం.. వ్యతిరేకంగా సినిమా తీసినా మంచే చేయడంతో ప్రశంసల వర్షం.!

  By Manoj
  |
  Nandamuri Balakrishna, A Man With A Golden Heart

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆయనలో ఉన్న టాలెంట్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లలో మెప్పిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారాయన. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే అత్యధికంగా అభిమాన సంఘాలు ఉన్న నటుడు బాలయ్యే అన్న టాక్ కూడా ఉంది. వ్యక్తిగతంగానూ ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయనలోని గొప్పదనం నిరూపించే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

  ఆ మూడూ పోయాయి.. ఆయన మీదే ఆశలు

  ఆ మూడూ పోయాయి.. ఆయన మీదే ఆశలు

  బాలకృష్ణకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. 2019లో ఆయన చేసిన మూడు సినిమాలూ తన తండ్రి బయోపిక్‌గా వచ్చిన ‘యన్.టి.ఆర్' రెండు భాగాలతో పాటు ఇటీవల విడుదలైన ‘రూలర్' బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే బోయపాటితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనపైనే బాలయ్య ఆశలు పెట్టుకున్నారు.

  ప్రజా సేవలో రాణిస్తున్న బాలయ్య

  ప్రజా సేవలో రాణిస్తున్న బాలయ్య

  నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజా సేవ చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో ఎంటరైన ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే, హైదరాబాద్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

  ఎన్టీఆర్‌కు బాలయ్య సాయం

  ఎన్టీఆర్‌కు బాలయ్య సాయం

  రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో నందమూరి తారక రామారావు పాత్రను పోషించిన విజయ్ కుమార్ అనే నటుడికి బాలయ్య సాయం చేశారని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. విజయ్ భార్య క్యాన్సర్‌తో బాధ పడుతుండగా, ఆమెను బసవతారకం ఆస్పత్రిలో చేర్పించారట. ఈ విషయం తెలిసిన బాలయ్య ఆమెకు ఉచితంగా వైద్యం చేయించారని సమాచారం.

  బాలయ్యపై ప్రశంసల వర్షం

  బాలయ్యపై ప్రశంసల వర్షం

  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నందమూరి బాలకృష్ణ సహా ఆయన కుటుంబం మొత్తానికి వ్యతిరేకంగా ఉన్న చాలా సీన్లు ఉన్నాయి. వాటిలో నటించిన విజయ్ కుమార్‌కే ఆయన సాయం చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. అదే సమయంలో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వ్యతిరేకంగా సినిమా తీసినా మంచి చేయడాన్ని కొనియాడుతున్నారు.

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి

  నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయినప్పటి నుంచి జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రామ్ గోపాల్ వర్మ, అగస్య మంజూ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీతేజ్, యజ్ఞాశెట్టి, విజయ్ కుమార్ తదితర నటులు కీలక పాత్రలు చేశారు.

  English summary
  Nandamuri Balakrishna is an Indian film actor and politician known for his works in Telugu cinema. He is the sixth son of Telugu film actor and former Chief Minister of Andhra Pradesh N. T. Rama Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X