Don't Miss!
- News
Tollywood News: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య..
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Sports
Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
అభిమానిపై బాలకృష్ణ ఆగ్రహం.. కొట్టేంత పనిచేసిన నటసింహం (వీడియో)
నందమూరి బాలకృష్ణకు అభిమానులంటే ఎంతో ఇష్టం. తనతో తప్పుగా ప్రవర్తిస్తే అంతే మొత్తంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పలు సందర్బాల్లో చేయ్యి కూడా చేసుకొన్న సంఘటనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలయ్య తన అభిమానులతో సంయమనంతో ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఒంగోలులో తన అభిమానిపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కోసం నందమూరి బాలకృష్ణ ఒంగోలుకు చేరుకొన్నారు. శుక్రవారం మధ్నాహ్నం శృతిహాసన్, నిర్మాత నవీన్ ఎర్నేనితోపాటు హెలికాప్టర్‌లో ప్రయాణించి వేదిక వద్దకు చేరుకొన్నారు. ఒంగోలులో బాలకృష్ణకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది తరలివచ్చి.. బాలకృష్ణను చూడగానే హర్షద్వానాలు పలికారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతూ శాలువాలు, దండలతో ఆహ్వానం పలికారు.

అయితే ఓ అభిమాని తనకు ఎదురుగా వచ్చి శాలువా కప్పి తన అభిమానాన్ని చాటుకొనేందుకు ప్రయత్నించారు. అయితే శాలువా వేసే క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు కిందపడిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖంపైనే చిర్రుబుర్రులాడారు. అభిమానిపై అరిచి... ఆగ్రహం వ్యక్తం చేశారు.
Reason? pic.twitter.com/p5cblFbCaq
— Johnnie Walter (@roopezh) January 6, 2023
బాలయ్య రియాక్షన్‌తో అభిమాని కంగుతిన్నాడు. కాసేపు బిత్తరచూపులు చూస్తూ నిలుచుండిపోయారు. ఆ తర్వాత పక్కనే ఉన్న అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిపోయారు.
అభిమానిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోను నెటిజన్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను ఓసారి లుక్కేయండి.