ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే, సినిమా డైరెక్టర్ వివరాలు వెల్లడించిన బాలయ్య!
నందమూరి అభిమానులు అందరూ బాగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ గురించి. లెజెండ్ సినిమా సమయంలో షూటింగ్లో కనపడి అందరి కళ్ళల్లో పడిన ఆయన ఆ తర్వాత ఎందుకు సినిమాల మీద ఆసక్తి కనబరచలేదు. ఇక ఆయన సినిమాలు చేయడు ఏమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్ కి బాలయ్య ఒక పండగలాంటి వార్త తన పుట్టినరోజు సందర్భంగా వినిపించారు. ఆ వివరాల్లోకి వెళితే

శుభాకాంక్షలు వెల్లువ
నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయనకు తన తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అయితే ఇంతటి హీరో కూడా తన పుట్టిన రోజును ఏదో స్టార్ హోటల్లో నిర్వహించకుండా తన తల్లి జ్ఞాపకార్ధంగా కట్టిన బసవతారకం ఆసుపత్రిలో కాన్సర్ పిల్లలతో కలిసి జరుపుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్
ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ తన ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పారు అని చెప్పొచ్చు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక ఛానల్ ఆయనతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో భాగంగా బాలయ్య అనేక విషయాలను పంచుకున్నాడు. తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి, చేయబోయే సినిమాలకు సంబంధించి కూడా అనేక ఆసక్తికర అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మూడు విషయాల్లో క్లారిటీ
ముందుగా ఒక మూడు విషయాలను క్లారిటీ ఇవ్వాలని ఇంటర్వ్యూలో కోరగా ఆ మూడు విషయాలకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ మూడు విషయాలు ఏమిటంటే నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ, అలాగే నర్తనశాల సినిమా మళ్ళీ చేసే అవకాశం ఉందా ? చేస్తే ఎవరితో చేస్తారు ?, అలాగే మీ డ్రీమ్ రోల్ చంఘీస్ ఖాన్ రోల్ ఎప్పుడు చేస్తారు ? ఎవరితో చేస్తారు ? అనే ప్రశ్నలను ఆయనకు సంధించారు.. ఈ మూడు ప్రశ్నలకు బాలకృష్ణ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

మళ్ళీ నర్తనశాల
ముందుగా నర్తనశాల సినిమా గురించి ఆయన స్పందిస్తూ ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయిందని సౌందర్య బతికుంటే సినిమా చేసేవాడిని కానీ ఆ ద్రౌపది స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేను అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేను కాబట్టి ఈ సినిమా తెరకెక్కించే అవకాశమే లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల సినిమా మొదలైంది. శ్రీహరి, సాయికుమార్, ఉదయ్ కిరణ్ అలాగే సౌందర్యలు లీడ్ రోల్స్ లో ఈ సినిమా ప్రారంభం కాగా సౌందర్య మరణంతో అర్థంతరంగా సినిమా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత ఉదయ్ కిరణ్ శ్రీహరి కూడా కాలం చేసిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఆ సినిమాతోనే
ఇక మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి స్పందిస్తూ ఆయన వివరాలు వెల్లడించారు. ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆదిత్య 369 సీక్వెల్ సినిమాకి తాను కానీ లేదా సింగీతం శ్రీనివాసరావు కానీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎలా అయితే తన తండ్రి తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఈ మొదటి సినిమాలో మెళుకువలు నేర్పిస్తానని అన్నారు..

ఆ పాత్ర చేసి తీరతా
తనకున్న విద్యను అంతా ఒక్క సినిమాతోనే ఆయనకు నేర్పిస్తానని చెప్పుకొచ్చారు. సింగీతం శ్రీనివాసరావు కధ చెబితే ముందు నచ్చలేదని, తానూ చెబితే అది వారికి బాగా నచ్చేసింది అని ఆయన అన్నారు. దీంతో చేస్తే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం చేస్తానని అన్నారని అన్నారు. ఇక తాను కాకుంటే మీరు తప్ప మీరే దర్శకత్వం చేయాలని కోరారని బాలయ్య అన్నారు. ఇక చంఘీస్ ఖాన్ పాత్ర గురించి కూడా బాలయ్య ఆసక్తికరంగా స్పందించారు. ఇంకా తన వయసు 61 సంవత్సరాలే కాబట్టి ఇంకా చాలా సమయం ఉందని ఎప్పుడైనా ఆ పాత్రని కచ్చితంగా చేసి తీరుతానని ఆయన అన్నారు. మొత్తం మీద అ బాలకృష్ణ చెప్పిన శుభవార్త ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండగ లాంటిదే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











