ఎలక్షన్ ఎలక్షన్‌కు పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు.. జగన్‌పై బాలయ్య సెటైర్..? వైరలవుతోన్న రూలర్ ట్రైలర్

నందమూరి బాలకృష్ణ - కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతోన్న రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. విశాఖ తీరంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య స్పీచ్ అదిరిపోయింది. స్టేజ్ ఎక్కితే బాలయ్య ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. ఆ మాటల ప్రవాహాంలో ఏమి వస్తాయో ఏం వెళ్తాయో ఒక్కోసారి భాషా పండితులకు కూడా అర్థం కాదు. తెలుగు సాహిత్యంపై అంత పట్టున్న బాలయ్య నిన్నటి స్పీచులో పద్యాలను, ప్రాసలను వల్లవేశాడు.

బాలయ్య స్పీచ్ అంతా ఓ వైపు అనుకుంటే.. రెండో ట్రైలర్‌ను విడుదల చేయడం, అందులోని డైలాగ్‌లు ప్రభుత్వానికి సైటైరికల్‌గా ఉండటం ఆసక్తికరమైన అంశం. బాలయ్య సినిమా చేస్తున్నాడంటే చాలు వద్దన్నా కూడా సెటైర్లు పడుతూనే ఉంటాయి. రాజకీయంగా కూడా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా సంచలన సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

ఫ్యామిలీ, రాజకీయాలు నేపథ్యంలో భారీ డైలాగ్‌లు..

ఫ్యామిలీ, రాజకీయాలు నేపథ్యంలో భారీ డైలాగ్‌లు..

నందమూరి ఫ్యామిలీ, ఎన్టీరామారావు, ఆయన సినీ పొలిటిలక్ జర్నీ, వారసత్వం ఇలా ప్రతీ వాటిని వాడేసుకుంటూ ఉంటాడు బాలయ్య. వీటిపై డైలాగ్‌లు లేకుండా బాలయ్య సినిమాను ఊహించడం కష్టం. వేదిక ఎక్కితే ఇవి లేకుండా మొదలు పెట్టడు.. ప్రసంగాన్ని ముగించడు. అంతలా బాలయ్యకు అలవాటైపోయాయి.

తాజా ట్రైలర్‌లోనూ..

రూలర్ కొత్త ట్రైలర్‌లో మరోసారి రెచ్చిపోయాడు బాలయ్య. కొత్త ట్రైలర్ చూస్తుంటే వైసీపీ నేతలకు భారీగా సెటైర్లు పడినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

ఎలక్షన్, ఎలక్షన్ పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు..

ఎలక్షన్, ఎలక్షన్ పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు..

పదవి అంటే నువ్వు చదివిని డిగ్రీ అనుకుంటున్నావా.. చచ్చేవరకు నీ వెంట రావడానికి.. ఎలక్షన్ ఎలక్షన్‌కు పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు అంటూ విలన్‌తో అదిరిపోయే డైలాగ్ చెప్పాడు బాలకృష్ణ. దాంతో పాటే రాజకీయంగా కూడా మరిన్ని డైలాగులతో రెచ్చిపోయాడు.

మద్యంపైనా సెటైర్లు..

మద్యంపైనా సెటైర్లు..

మరోవైపు సినిమాలో మద్యపానం గురించి కూడా కొన్ని డైలాగులున్నట్లు కనిపిస్తోంది. గ్లోబ్‌ను గోలీలా చుట్టి ప్రపంచంతో ఆడుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా నీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా అంటూ మరో పవర్ ఫుల్ డైలాగ్ కూడా వేసాడు బాలకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X