For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీకైన బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తాజా ఫొటోలు.. షాక్‌లో నందమూరి ఫ్యాన్స్

  By Manoj Kumar P
  |

  ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఈ క్రమంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు.

  ఈయన తర్వాత ఆ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న ఇలా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో తారక్, కల్యాణ్ మాత్రమే సినిమాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య వారసుడి గురించి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఆయన కుమారుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దీనికి కారణం ఏంటో తెలుసా..?

  మోక్షజ్ఞ స్నేహితులిద్దరూ వచ్చేశారు

  మోక్షజ్ఞ స్నేహితులిద్దరూ వచ్చేశారు

  నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అతడి స్నేహితులు అక్కినేని అఖిల్, మెగా డాటర్ నిహారిక ఇప్పటికే వెండితెరకు పరిచయం అవడంతో మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ జరుగుతూ వస్తోంది. దీంతో ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

  మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమాతోనే

  మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమాతోనే

  వాస్తవానికి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఇప్పటికే జరిగిపోయి ఉండేదన్న టాక్ ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన వందవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలోనే అతడు నటిస్తాడని అప్పుడు జోరుగా ప్రచారం జరిగింది. అదే సరైన సమయం అని కూడా అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు.

  బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు

  బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు

  తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ గతంలో స్పందించారు. మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతాడని ప్రకటించారు. అంతేకాదు, అందుకోసం మంచి కథను సిద్ధం చేయాలని కొందరు దర్శకులకు కూడా సూచించానని అన్నారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ, తొలి సినిమా దర్శకుడిపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

  ఆ ఫొటోలను చూసి షాకయ్యారు

  ఆ ఫొటోలను చూసి షాకయ్యారు

  ఇటీవల నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలవి. వీటిలో మోక్షజ్ఞ లావుగా ఉండడంతో చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీంతో అతడు సినిమాల్లోకి రావడం కష్టమన్న టాక్ వినిపించింది.

   లీకైన మోక్షజ్ఞ తాజా ఫొటోలు

  లీకైన మోక్షజ్ఞ తాజా ఫొటోలు

  తాజాగా నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలయ్య, ఆయన భార్యతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు ఉన్నారు. అంతేకాదు, చివర్లో మోక్షజ్ఞ కూడా దర్శనమిస్తున్నాడు. ఈ ఫొటోలో కూడా అతడు భారీ కాయంతో కనిపిస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

  Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
  బాలయ్య మాత్రం అలా

  బాలయ్య మాత్రం అలా

  బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రూలర్'. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సీ కల్యాన్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలయ్య స్లిమ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

  English summary
  Nandamuri Balakrishna is looking lean. The 60-year-old actor has slimmed down. He lost nearly 8 kgs to look fit for a role in ‘Ruler’. The new still that was released today gives a glimpse of his slim avatar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X