Nandamuri Balakrishna నటసింహం చేతుల మీదుగా చోర్ బజార్ ట్రైలర్.. పూరి జగన్నాథ్ కొడుకుకి సోపర్ట్ అలా!

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతున్నది.. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్‌ను నట సింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. బిజీ షెడ్యూల్స్‌లోనూ తమ సినిమా ట్రైలర్ విడుదల చేసిన బాలకృష్ణకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపారు.

ట్రైలర్ రిలీజ్ అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ...చోర్ బజార్ ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్ సినిమా నుంచి పూరి జగన్నాథ్ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆకాష్ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు. మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే. కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గినా ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. కొత్తగా, భిన్నంగా ఉన్న చిత్రాలకు అందరి ఆదరణ తప్పకుండా ఉంటుంది. చోర్ బజార్ కూడా అలాంటి కొత్త తరహా సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

 Nandamuri Balakrishna unveils Akash Puris Chor Bazaar trailer

చోర్ బజార్ ట్రైలర్ లో హీరో ఆకాష్ పురి బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్‌తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా. నా దిల్ కా దడ్కన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడం ద్వారా దర్శకుడు జీవన్ రెడ్డి కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు

 Nandamuri Balakrishna unveils Akash Puris Chor Bazaar trailer

సాంకేతిక నిపుణులు

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: అన్వర్ అలీ, ప్రభు దేవా
ఆర్ట్: గాంధీ నడికుడికర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్: సాయి మనీందర్ రెడ్డి
ఆడియో: లహరి
కాస్ట్యూమ్స్ డిజైనర్: ప్రసన్న దంతులూరి
ఫైట్స్: ఫృథ్వీ శేఖర్
కొరియోగ్రఫి: భాను
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
స్టిల్స్: వికాస్ సీగు
పీఆర్వో: జీఎస్కే మీడియా
మేకప్: శివ
కాస్ట్యూమ్ చీఫ్: లోకేష్
డిజిటల్ మీడియా: వాల్స్ అండ్ ట్రెండ్స్
సహ నిర్మాత: అల్లూరి సురేష్ వర్మ
బ్యానర్: ఐ.వి ప్రొడక్షన్స్
నిర్మాత: వీ.ఎస్ రాజు
రచన, దర్శకత్వం: బీ జీవన్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X