Just In
- 22 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్లో సినీ పరిశ్రమ!
- 27 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 53 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవర్ఫుల్ గా సిద్దమవుతున్న బాలయ్య, వరుసగా 5 సినిమాలు.. లైనప్ మామూలుగా లేదు!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఏ సినిమా చేసినా కూడా అభిమానుల్లో అలా స్పెషల్ బజ్ క్రియేట్ చేస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన నెక్స్ట్ సినిమాల రేంజ్ ని అమాంతంగా పెంచేస్తుంటారు. ఇక రానున్న రోజుల్లో బాలకృష్ణ వరుస సినిమాలతో మరింత బిజీగా మారనున్నారు. ప్రస్తుతానికి బాలయ్య 5సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో.. బిజీబిజీగా
బాలకృష్ణ వయసు ప్రస్తుతం 60ఏళ్ళు. అయినా కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. ఉదయమే అందరికంటే ముందుగా సెట్స్ లోకి వచ్చి యూనిట్ సభ్యులను మరియాదగా పలకరిస్తూ ఉంటారు. ఇక రానున్న రోజుల్లో బాలకృష్ణ తీరిక లేకుండా సినిమాలతో బిజీ అవ్వనున్నట్లు అర్ధమయ్యింది. ముఖ్యంగా ప్రస్తుతం బోయపాటి సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే.

హిట్టిచ్చిన సీనియర్ దర్శకుడితో..
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసిన తరువాత బాలకృష్ణ ఎవరితో వర్క్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారితో ఇవ్వలేదు గాని వరుసగా దర్శకులు అయితే ఆయన కోసం కథలు పట్టుకొని రెడీగా ఉన్నట్లు సమాచారం. అందులో బి.గోపాల్ ఒకరు. ఈ సీనియర్ దర్శకుడు గతంలో బాలయ్యతో లారీ డ్రైవర్, నరసింహనాయుడు వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

డిక్టేటర్ దర్శకుడితో కూడా
ఇక పూరి జగన్నాథ్ తో కూడా బాలకృష్ణ మరో మాస్ మసాలా సినిమాను ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చట. ఇదివరకే వీరి కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా వచ్చింది. కానీ అది అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక గతంలో డిక్టేటర్ సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీవాస్ తో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.

మరో మంచి సందేశాత్మక చిత్రం
రీసెంట్ గా బాలకృష్ణ కు ఒక దర్శకుడు మంచి సందేశాత్మక కథ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. ఆ నలుగురు డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్. కథ నచ్చడంతో బాలయ్యా వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విధంగా బాలకృష్ణ వరుసగా 5 సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.