Akhanda 2: బాలయ్య మాస్ ఫెస్టివల్.. 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ ఫిక్స్..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. అలా హిట్ కాంబో లో 'అఖండ 2: తాండవం'వస్తుంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. బాలయ్య మాస్ ఎనర్జీ, బోయపాటి మాస్ టచ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించనున్నాయని అభిమానులు నమ్ముతున్నారు. తాజాగా సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
'అఖండ 2: తాండవం' సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' విడుదల రోజునే నందమూరి బాలకృష్ణ 'అఖండ 2: తాండవం' విడుదల అవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే అభిమానులు ఎక్కువగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తాజాగా 'అఖండ 2' టీజర్‌లో రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయబోతోంది.

నాలుగేళ్ల తర్వాత
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' 2021 డిసెంబర్ 2న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే డిసెంబర్‌లో 'అఖండ 2: తాండవం' ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌కి డిసెంబర్ మళ్లీ పండగలా మారనుంది. ఈ సీక్వెల్‌లో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'భజరంగీ భాయ్‌జాన్'క్యూట్ కిడ్‌గా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ అంశం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
తమన్ మ్యూజిక్ మళ్లీ హైలైట్
'అఖండ'కి మైండ్‌బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్.ఎస్. తమన్, సీక్వెల్‌కి కూడా అదే స్థాయి ఎనర్జీతో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఆయన స్కోర్ మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. 'అఖండ 2'ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అదే రోజున బాలీవుడ్ నుంచి 'దురంధర్' అనే భారీ యాక్షన్ మూవీ కూడా విడుదల కానుంది. దీంతో నార్త్ ఇండియాలో 'అఖండ 2'కి గట్టి పోటీ ఎదురుకానుంది. ఏదిఏమైనా డిసెంబర్ 5న బాలయ్య 'అఖండ 2: తాండవం'తో బాక్సాఫీస్ బరిలోకి దూసుకొచ్చి మరోసారి 'బాలయ్య ఇజ్ బ్యాక్' అని రుజువు చేయబోతున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రికార్డులపై బాలయ్య కన్ను
బాలకృష్ణ-బోయపాటి కాంబో ఈ సారి కూడా అదే రేంజ్‌లో రికార్డులు తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్‌లో జోడించిన రిలీజ్ డేట్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు. మొత్తానికి, డిసెంబర్ 5న బాలయ్య 'అఖండ 2: తాండవం' మాస్ ఫెస్టివల్ మొదలుకానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదిఏమైనా డిసెంబర్ 5న బాలయ్య 'అఖండ 2: తాండవం'తో బాక్సాఫీస్ బరిలోకి దూసుకొచ్చి మరోసారి 'బాలయ్య ఇజ్ బ్యాక్' అని రుజువు చేయబోతున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు


Click it and Unblock the Notifications











