MAA Elections:అధ్యక్ష పదవికి పోటీపై క్లారిటీ ఇచ్చిన నందమూరి కల్యాణ్ రామ్..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే బరిలో ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, మంచు విష్ణు, నటి హేమ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా మా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు గురువారం ఉదయం మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆ క్రమంలో కల్యాణ్ రామ్ ఆ వార్తను ఖండిస్తూ స్పందించారు. మా ఎన్నికలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

గత ఎన్నికల సమయంలో నరేష్ - శివాజీ రాజా వర్గాలు పోటాపోటీగా ఎన్నికల్లో పాల్గొనడమే కాక ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. దానికి తగ్గట్లుగా ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నట్లుగా ముందునుంచే ప్రచారం జరగగా ఆయన ఆ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి ధ్రువీకరించారు.

nandamuri Kalyan RAM is not contesting in MAA elections

తాను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో పోటీలోకి దిగుతున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.. ఆయన ప్రకటించిన రోజు మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి వెళ్లి సూపర్ స్టార్ కృష్ణను కలిసి రావడంతో ఆయన కూడా బరిలో ఉన్నారని మద్దతు కోరేందుకు అక్కడికి వెళ్లారు అనే ప్రచారం మొదలైంది.. ఇక అదే రోజు రాత్రికి జీవిత రాజశేఖర్ కూడా మా ఎన్నికల బరిలో దిగుతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మధ్యాహ్నం క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తాను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అని ప్రకటించి సంచలనం రేపారు.

తనను ఉపాధ్యక్షురాలిగా గెలిపించిన వారి కోసమే పోటీలోకి దిగుతున్నా అని పేర్కొన్న ఆమె ముందు అసలు పోటీలోకి దిగకూడదు అని భావించినా, ఇప్పుడు వారి కోరిక మేరకు దిగక తప్పడం లేదని ప్రకటించారు. ఇక ఈ ఉదయం నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారనే ప్రచారం మీడియాలో పెద్దఎత్తున జరిగింది. నందమూరి బాలకృష్ణ అండతో ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారని చెబుతూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ మా అధ్యక్ష బరిలో దిగడం లేదని చెబుతూ ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అదంతా ప్రచారమే కానీ అందులో ఏమాత్రం నిజం లేదని వారి ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X