నందమూరి హీరో సినిమా చూసి సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా? ఎంత మంచివాడవురా!

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న తాజా సినిమా 'ఎంత మంచివాడవురా!'. ఉమేష్ గుప్త సమర్పణలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్ ఇస్తూ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 17వ సినిమా. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన అందాల తార మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. గోపిసుందర్ సంగీతం బాణీలు కట్టారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. 'ఎంత మంచివాడవురా!' సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ U సర్టిఫికెట్ జారీ చేశారు.

Nandamuri Kalyan Rams Entha Manchivaadavuraa Censor Report

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ సినిమా రావడంలేదు కాబట్టి.. అదే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమాపై ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఈ మేరకు చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్‌కి కూడా మంచి డిమాండ్ నెలకొంది.

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ వారు దక్కించుకున్నారని తెలిసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కళ్యాణ్ రామ్ సినిమాలకు ఉన్న రెస్పాన్స్ దృష్ట్యా భారీ మొత్తానికి ఈ హక్కులు పొందారని టాక్. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్రయూనిట్.. ఓవర్సీస్‌లో జనవరి 14వ తేదీన ప్రీమియర్స్ పడతాయని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X