నాని, సమంత మళ్లీ జంటగా.. సుధీర్ బాబు కీలక పాత్రలో.. దర్శకుడు ఎవరంటే
ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచుకొన్న నాని, సమంత అక్కినేని మరోసారి జతకట్టనున్నారు. సమ్మోహనం చిత్రంతో ఫీల్‌గుడ్ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా ముద్ర వేసుకొన్న ఇంద్రగంటి మోహనకృష్ణ తదుపరి చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు.
తాను రూపొందించే సినిమాలో హీరోయిన్‌గా నటించాలని సమంతను ఇంద్రగంటి మోహనకృష్ణ సంప్రదించినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఏడాది మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం నాని నటించిన జెర్సీ చిత్రం విడుదలకు ముస్తాబువుతున్నది. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌గా అవతారం ఎత్తనున్నారు. ఇక సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలి చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రీల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.


Click it and Unblock the Notifications











