For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గ్యాంగ్‌ లీడర్‌ టీజర్‌ ట్రెండింగ్.. నా వల్ల కాదంటూ...

  |

  నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 24 ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

  Nani as Gang Leader: Teaser get good response

  స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఫన్నీగా సాగే డైలాగ్స్‌తో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది టీజర్‌. 'ఎస్‌.. ఎస్‌.. ఐ యామ్‌ ద పెన్సిల్‌.. ఫేమస్‌ రివెంజ్‌ రైటర్‌.. పెన్సిల్‌ పార్థసారథి' అంటూ తనని తాను ఇంట్రడ్యూస్‌ చేసుకోవడంతో టీజర్‌ మొదలవుతుంది. ఆ తర్వాత తన గ్యాంగ్‌ని పరిచయం చేస్తూ 'ఈరోజు ఇంటికి ఐదుగురు లేడీస్‌ వచ్చారు. వాళ్ళ ఏజ్‌లు, గెటప్‌లు చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్‌ లైఫ్‌ సైకిల్‌ని చూస్తున్నట్టనిపించింది. భలే ఉన్నార్లే' అంటూ నాని చెప్పే డైలాగ్స్‌ ఆయా క్యారెక్టర్లపై క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. ఆ తర్వాత ఆ గ్యాంగ్‌, నాని కలిసి చేసిన కొన్ని సీన్స్‌ నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న కార్తికేయ కూడా టీజర్‌లో కనిపిస్తారు. 'మీతో నావల్ల కాదు.. నా వల్ల కాదు.. నన్ను రిలీజ్‌ చేసెయ్యండి' అంటూ నాని చెప్పే డైలాగ్‌తో టీజర్‌ కంప్లీట్‌ అవుతుంది. ఈ టీజర్‌ రిలీజ్‌ అయిన కొద్ది నిముషాల్లోనే లక్షల వ్యూస్‌ని సాధిస్తూ అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంటోంది.

  ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్‌లోని ప్రతి షాట్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా ఉంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో తప్పకుండా నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్‌ని వేసుకోవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

  English summary
  Mohan Krishna's Gang Leader to release on Chiranjeevi birthday. On Mohan Krishna's birth day, this movie's first look released. In this occassion, Unit announced movie release date on August 22nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X