Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాస్టార్‌పై నాని కామెంట్.. 'గ్యాంగ్ లీడర్' ప్రస్తావన తెస్తూ!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అలుపెరగని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా ఎదుగుతూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఆయన మెగాస్టార్‌గా తెలుగు సినీ పరిశ్రమ రారాజుగా వెలిగిపోతున్నారు. సినీ పరిశ్రమలోని ప్రతీ వ్యక్తితో కలివిడా ఉండే ఆయన ఈ రోజు (ఆగస్టు 22 - 2019) తన 64 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
This shot in our film is a tribute to the classic gangleader.. on the occasion of megastar’s birthday we decided to show you a glimpse of it as a poster :))
— Nani (@NameisNani) August 22, 2019
Happy birthday sir ... you are the Gang leader we will always look up to 🙏🏼❤️#HBDEvergreenMegaStar pic.twitter.com/FyjzPL7xNk
ఈ నేపథ్యంలో తాజాగా నాచురల్ స్టార్ నాని తనదైన స్టైల్ లో చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలుపుతూ 'గ్యాంగ్ లీడర్' సినిమా పోస్టర్ విడుదల చేశాడు. 'గ్యాంగ్ లీడర్' సినిమా నుంచి కొత్త పోస్టర్ అభిమానులతో పంచుకుంటూ ''మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆ షాట్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేస్తున్నాం. మా సినిమాలోని ఈ షాట్.. క్లాసిక్ గ్యాంగ్ లీడర్‌కు ఓ ట్రిబ్యూట్. హ్యాపీ బర్త్‌డే సర్.. నిజమైన గ్యాంగ్ లీడర్ మీరే'' అని ట్వీట్ చేశాడు నాని. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు.