Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పసుపులేటి రామారావు మృతి: సినీ ప్రముఖుల సంతాపం.. నాని, కళ్యాణ్ రామ్ దిగ్బ్రాంతి
తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఎన్నో సేవలందించిన పసుపులేటి రామారావు (70) మృతితో చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన ఈ రోజు (మంగళవారం) ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
|
నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మరణవార్త తెలిసి చాలా భాధపడ్డానని పేర్కొంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
|
నిర్మాత BVSN ప్రసాద్ సంతాపం
పసుపులేటి రామారావు మరణవార్త చాలా బాధపెట్టింది. తెలుగు సినీ పరిశ్రమకు ఓ రచయితగా, జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఇన్నో సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. అంటూ నిర్మాత BVSN ప్రసాద్ తన సంతాపం వ్యక్తం చేశారు.
|
హరీష్ శంకర్ ట్వీట్..
నిజమైన నిజాయితీ గల జర్నలిస్టుల్లో ఒకరైన పసుపులేటి రామారావు గారిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ సంతాపం తెలిపారు.
|
నాని సంతాపం
చిన్న పిల్లల్లాంటి స్వచ్ఛమైన మనసున్న మనిషి పసుపులేటి రామారావు గారు. ఆయనలో చాలా నిజాయితీ చూశాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని పేర్కొంటూ నాని ట్వీట్ చేశారు.

చిరంజీవి ఆప్తుడు.. కళామతల్లి సేవకుడు
సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని నేటి యంగ్ హీరోల వరుకు అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆయన సొంతం.

రేపు అంత్యక్రియలు
ఈ రోజు రామారావు స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఉంచి.. రేపు అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని ఆయన తోడల్లుడు చెప్పాడు. సన్నిహితులు, అభిమానుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని కృష్ణానగర్‌లో ఉన్న ఆయన సొంతింటికి తరలించారు.