Just In
Don't Miss!
- Sports
ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే అతడిని ఎందుకు తీసుకోలేదు: మైకేల్ వాన్ ఫైర్
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ ఫొటోను దాచుకుంటా.. థ్యాంక్యూ అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చిన నాని
నాని.. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు వారి మనసు దోచిన యంగ్ హీరో. స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అని కూడా బిరుదును దక్కించుకున్నాడు. నటన, బావోద్వేగాలు పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ మంచిగానే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే 'ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక, చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని 'గ్యాంగ్ లీడర్' సినిమా యూనిట్ గురువారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు నాని 'మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆ షాట్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేస్తున్నాం. మా సినిమాలోని ఈ షాట్.. క్లాసిక్ గ్యాంగ్ లీడర్‌కు ఓ ట్రిబ్యూట్. హ్యాపీ బర్త్‌డే సర్.. నిజమైన గ్యాంగ్ లీడర్ మీరే' అని ట్వీట్ చేశాడు. దీంతో చిరు బర్త్ డే రోజు ఈ పిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
Saved the pic 🙈
— Nani (@NameisNani) August 22, 2019
Thank you 🙏🏼 https://t.co/N0xqkKzeEp
తాజాగా ఓ నెటిజన్ చిరంజీవి సగం ఫొటోను, నాని సగం ఫొటోను కలిపి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, 'మీ గ్యాంగ్ లీడర్ చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని ట్వీట్ చేశాడు. దీనికి నాని 'ఈ ఫొటోను దాచుకుంటాను. థ్యాంక్యూ' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ హైలైట్ అయింది.