twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    TuckJagadish : నలిగిపోతున్నానన్న నాని .. కానీ వాళ్ళకే అధికారం, సంపూర్ణ సహకారం!

    |

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న జగదీష్ సినిమా రిలీజ్ గురించి అనేక చర్చోప చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిజానికి రెండో దశ లాక్ డౌన్ విధించక ముందు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రెండో దశ కరోనా కారణంగా థియేటర్లు మూసివేస్తారు అనే అంచనాల నేపథ్యంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ కాబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు నాని ఈ విషయం మీద స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
    అసలేం జరుగుతోంది?

    అసలేం జరుగుతోంది?


    'టక్ జగదీష్' సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందని.. ఈ నేపథ్యంలో దీన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి దాకా యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడం.. ఈ మధ్య విడుదలైన చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంతో.. 'టక్ జగదీష్' యూనిట్ ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకుందని ప్రచారం కూడా మొదలయింది. ఈ క్రమంలో అసలేం జరుగుతుందో అర్థం అయితే కావడంలేదు.

    సెకెండ్ వేవ్ కారణంగా

    సెకెండ్ వేవ్ కారణంగా

    నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ నిర్వాణ తెరకెక్కించిన 'టక్ జగదీష్' మూవీ ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే దీన్ని గత ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇక, ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడంతో ఈ సినిమా విడుదల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని తాజాగా ఈ అంశం మీద స్పందించారు.

    అతి పెద్ద అభిమానిని

    అతి పెద్ద అభిమానిని


    తాను ఒక సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే ఇష్టమని, 'టక్ జగదీశ్' మూవీని కూడా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీశామని నాని చెప్పుకొచ్చారు. అయితే కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోక పోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందులు... వీటన్నింటి దృష్ట్యా నిర్ణయాన్ని వారికి వదిలేశానని అన్నాడు. అయితే నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరిస్తే... మొదట ఆనందించేది తానే అనే భావన కూడా నాని ఈ లేఖలో పరోక్షంగా వ్యక్తం చేశాడు.

    తుది నిర్ణయాన్ని వినయంగా అంగీకరిస్తా

    టక్ జగదీష్ గురించి నిర్ణయాన్ని షైన్ స్క్రీన్‌లకు మరియు వాటాదారులందరికీ వదిలివేస్తున్నానని పేర్కొన్న ఆయన వారి తుది నిర్ణయాన్ని వినయంగా అంగీకరిస్తానని అన్నాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా, తాను సహకరిస్తానని, ఫైనల్ గా నిర్ణయాధికారం మాత్రం నిర్మాతలకే అని చెప్పుకొచ్చాడు. తాను క్రాస్ రోడ్స్ లో ఉన్నానని పేర్కొన్న నాని'టక్ జగదీశ్' మూవీ ఎలా విడుదలైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పాడు.

    ఓటీటీలోనే

    ఓటీటీలోనే

    ఇక 'టక్ జగదీష్' మూవీని ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు అని దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని కూడా ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలో హీరో నాని అసంతృప్తిగా ఉన్నాడన్న టాక్ వినిపించగా ఇప్పుడు డానికి నాని క్లారిటీ ఇచ్చినట్టు అయింది. షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు.

    English summary
    Natural star Nani responds to Tuck Jagadish release issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X