Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గ్యాంగ్ లీడర్ ట్రైలర్: ఐదుగురు ఆడవాళ్ళతో కలిసి నాని యుద్ధం
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన ఆడిపాడుతున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా తాజాగా గ్యాంగ్ లీడర్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తూ అంచనాలు పెంచేశాయి. ఓ ఐదుగురు ఆడవాళ్ళ రివెంజ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని అర్థమవుతోంది. పెన్సిల్ పార్ధసారధి పాత్రలో నాని పర్‌ఫార్‌మెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. తన ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్‌తో కలిసి నాని.. విలన్ అయిన కార్తికేయ మీదకు యుద్దానికి వెళ్ళడం ఈ ట్రైలర్‌లో చూపించారు. చిత్రంలో బామ్మగా లక్ష్మి, వరలక్ష్మిగా శరణ్య, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్ బాగా ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) సంయుక్తంగా గ్యాంగ్ లీడర్ సినిమాను నిర్మిస్తున్నారు. జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని కెరీర్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం.