ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం చంద్రోదయం. పీ వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ & శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ వెన్నుపోటు పాటకు వ్యతిరేకంగా రిలీజ్ చేసిన పాట సంచలనం రేపింది.
దర్శకుడు వెంకట రమణ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ చంద్రబాబు నాయుడు భారతదేశం గర్వించతగ్గ నాయకుడు. అపారమైన మేథోసంపత్తితో ఆంధ్రప్రదేశ్‌ని అగ్ర పథాన నిలిపారు. 68 ఏళ్ల వయసులోనూ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అందుకే అలాంటి మహానుభావుడి కష్టం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళకు తెలియజేయడానికే ఈ చంద్రోదయం చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చంద్రబాబు బయోపిక్ ఎందుకు తీస్తున్నావని అడిగే వాళ్లకు మా చంద్రోదయం సరైన సమాధానం చెబుతుంది. ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 31న నిర్వహించనున్నాం అని తెలిపారు.
చిత్ర నిర్మాత జిజె రాజేంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి బయోపిక్ తీసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది . డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాని విడుదల చేస్తాం అని అన్నారు.
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.
Nara Chandra Babu Naidu Biopic's getting ready for release. P Venkata Ramana is the director for this movie. GJ Rajendra is producer. This movie Audio release function on Jan 31st
Story first published: Saturday, January 26, 2019, 21:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more