Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రామ్ గోపాల్ వర్మను చూస్తే భయమేస్తోంది… నర్సింగ్ యాదవ్ భార్య సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత వర్మ పుణ్యమా అని బాలీవుడ్ దాకా వెళ్ళిన నర్సింగ్ యాదవ్ గత ఏడాది డిసెంబర్ 31న ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్న ఆయన చివరికి మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్క సారిగా షాక్ కు గురయింది.. అలాగే నర్సింగ్ యాదవ్ కుటుంబానికి చాలామంది సినీ పెద్దలు ఫోన్ చేసి మరీ అండగా ఉంటామని తెలిపారు. ఇక నర్సింగ్ యాదవ్ పోయిన బాధ నుంచి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

చిరంజీవి కంటే ముందే
తాజాగా నర్సింగ్ యాదవ్ భార్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో నర్సింగ్ యాదవ్ తో తన వివాహం గురించి అలాగే సినీ పెద్దలతో నర్సింగ్ యాదవ్ కు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ముందుగా చిరంజీవి ఫ్యామిలీతో తమకు ఉన్న అనుబంధం గురించి ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న దాదాపు ప్రతి సినిమాలో నర్సింగ్ యాదవ్ కూడా తీసుకునేవారని అలాగే చిరంజీవి షూటింగ్ స్పాట్ కి వెళ్లే కంటే ముందే నర్సింగ్ యాదవ్ అక్కడికి వెళ్లి అన్ని సవ్యంగా ఉన్నాయో లేదో చూసుకునే వారని ఆమె చెప్పుకొచ్చింది.

చిరంజీవితో పాటు వర్మతో
వారి ఇద్దరి మధ్య అనుబంధం వెలకట్టలేనిది అని నర్సింగ్ యాదవ్ చనిపోయిన సమయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు అని చెప్పుకొచ్చింది. అయితే అదే ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా వర్మని ఇప్పుడు చూస్తుంటే భయమేస్తోంది అని ఆమె చెప్పుకొచ్చింది. విషయం ఏమిటంటే సదరు యాంకర్ మాట్లాడుతూ ఒక పక్క చిరంజీవి కుటుంబం తో సన్నిహితంగా ఉంటూనే మరో పక్క వర్మ తో కూడా సన్నిహితంగా ఉండేవారు అంట కదా అని ప్రశ్నించింది.

అందుకే సాన్నిహిత్యం
దీనికి సమాధానంగా ఆమె ఈ కామెంట్ చేశారు.. క్షణక్షణం సినిమాలో వర్మ నర్సింగ్ యాదవ్ కు సినిమా అవకాశం ఇచ్చారని దీంతో రాంగోపాల్ వర్మ తో కూడా నర్సింగ్ యాదవ్ కు సన్నిహిత అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది.. వర్మ కూడా నర్సింగ్ యాదవ్ కు చాలా గౌరవం ఇచ్చే వారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక వర్మ కుటుంబంతో కూడా అప్పుడప్పుడు కలిసేవారమని వర్మ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో ఉండేవారని ఆమె చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో తాను వారి కుటుంబాన్ని కలిశానని, నర్సింగ్ యాదవ్ వారి ఇంటికి తీసుకు వెళ్లే వారని గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాక ఇక అప్పటి వర్మకి ఇప్పటి వర్మకి ఏమైనా తేడా కనిపిస్తుందా అని యాంకర్ ప్రశ్నించగా ఇప్పటి వర్మని చూస్తే భయమేస్తోంది అని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికీ ఇప్పటికీ వర్మలో చాలా మార్పు వచ్చిందని అప్పుడు చాలా సౌమ్యంగా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.

వర్మ గురువు, చిరంజీవి ప్రాణం
రాంగోపాల్ వర్మ నర్సింగ్ యాదవ్ కు గురువు లాంటి వారైతే చిరంజీవి ప్రాణం లాంటివారు అని నర్సింగ్ యాదవ్ భార్య చెప్పుకొచ్చారు.. చిరంజీవి ఒక రకంగా నర్సింగ్ యాదవ్ కు గాడ్ ఫాదర్ లాంటి వారని ఆమె పేర్కొన్నారు. అందుకే తన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 లో సైతం నర్సింగ్ యాదవ్ ఒక చిన్న పాత్రలో నటింపచేశారని ఆమె చెప్పుకొచ్చింది.. ఇక నర్సింగ్ చిత్ర దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పుట్టిన సమయంలో చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లగా చిరంజీవి అప్పటికప్పుడు ఏడు తులాల బంగారు గొలుసు వేయించారని చిత్ర చెప్పుకొచ్చారు..