For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naresh vs Natti : రేసుల గురించి మాట్లాడొద్దు.. మీరు చెప్పేది నిజం కాదు.. తేజ్ కేసులో ఆరోపణలు!

  |

  సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వార్త ఇప్పుడు టాలీవుడ్ మొత్తం చర్చనీయాంశంగా మారింది. నిన్న(శుక్రవారం) రాత్రి హైదరాబాద్‌లో గచ్చిబౌలి వెళుతున్న ఆయన బైక్ ప్రమాదానికి గురికావడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి తేజ్‌ ను అప్పటికప్పుడు హాస్పిటల్ కి తరలించడంతో ఇప్పుడు ప్రాణాపాయం తప్పింది. అయితే ఆయన యాక్సిడెంట్ మీద మాటల తూటాలు పేలుతున్నాయి. నరేష్ మాట్లాడిన మాటల గురించి నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  అపోలోలో చికిత్స

  అపోలోలో చికిత్స

  రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు చేరుకొని తేజును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.ఇక నరేష్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. తన కొడుకుతోనే తేజూ బయటకు వెళ్ళాడని అందరికీ 1000 సిసి బైక్స్ ఉన్నాయన్న ఆన మళ్ళీ బైకుల జోలికి వెళ్లకుండా ఒట్టు పెట్టించుకుంటామని అన్నారు.

  రాష్ డ్రైవింగ్ ఏం లేదు

  రాష్ డ్రైవింగ్ ఏం లేదు

  నేను కూడా బైకర్ నేనని అన్న ఆయన ఇవన్నీ 1000 సిసి బైకులు..ఇలాంటి పవర్ ఫుల్ బైకులు ఇలాంటి రోడ్లపై వాడకూడదని కోటా, బాబు మోహన్ వాళ్ళ కొడుకులు కూడా ఇలానే చనిపోయారని అన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారన్న ఆయన మా పిల్లలు అంతా కలిసి పెరిగారని, వీళ్ళందరికీ బైక్ క్లబ్ ఉంది, రైడ్స్ కు వెళుతుంటారని అన్నారు. నిన్న రాష్ డ్రైవింగ్ ఏం లేదని పెళ్లి చేసుకొని కెరీర్ లో సెటిల్ కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అయితే రేసింగ్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

  దేవుడిని ప్రార్థిద్దాం

  దేవుడిని ప్రార్థిద్దాం

  ఇక ఈ విషయం మీద స్పందించిన నిర్మాత నట్టి కుమార్ నరేష్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంలో నరేష్‌ రేసింగ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఒక ఆడియో విడుదల చేసిన నట్టి కుమార్ మాట్లాడుతూ ‘‘సాయిధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చి, షూటింగ్స్ చేసుకుంటూ మామూలు మనిషి అయి రావాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం అని అన్నారు.

  రాజకీయాలు వద్దు

  రాజకీయాలు వద్దు

  అలాగే ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలచుకున్నానన్న ఆయన ఇప్పుడు రాజకీయాలు వద్దు, రాజకీయాలు చేయాలని చూడవద్దని అన్నారు. ధరమ్ తేజ్ క్షేమంగా బయటికి రావాలని.. సినిమా తరపున అందరం ప్రార్థనలు చేద్దామన్న ఆయన నరేష్ గారు మాట్లాడింది నాకైతే నచ్చలేదని, ఆయన ఇప్పుడు రేసింగ్ వ్యవహారం తీసుకురావడం కరెక్ట్ కాదని, తేజ్ రేసింగ్‌ చేయట్లేదని, ఆయన మాములు డ్రస్‌లో వెళుతున్నారని అన్నారు.

  మీ దుర్గం చెరువు బ్రిడ్జి

  మీ దుర్గం చెరువు బ్రిడ్జి

  ఇక తేజ్ ఆయన ఇంటి నుంచి వెళుతున్నారని, అందుకే దుర్గం చెరువు బ్రిడ్జి మీద నుంచి వెళుతున్నారని కానీ మీరు చెబుతున్న దాని ప్రకారం మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారని అంటున్నారని, అయితే మీరు చెబుతుంది రాంగ్ అని అనిపిస్తుందని, ఆయన తన ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి వస్తున్నట్లు ఉంది తప్ప.. మీ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నట్టు లేదని అన్నారు. ఇక తేజ్ స్పీడ్ కూడా తక్కువలోనే వెళుతున్నాడని అన్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎందాకా వెళుతుంది అనేది.


  English summary
  Natty Kumar Shocking Reaction On Naresh Comments about Sai Dharam Tej Accident in a recent press conference.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X