మన హీరోల కోసం అంటూ నాని పోస్ట్.. త్వరలో సంథింగ్ స్పెషల్...అదేనా?

గత ఏడాది మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన వీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఆశించినంత మేర అంచనాలను అందుకో పోవడంతో ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆ సినిమా వాయిదా వేశారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే నాని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ కాగా మరో సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ.

ఈ సినిమాల షూటింగ్ అయితే ప్రస్తుతానికి జరగడం లేదు. నిజానికి నాని రిస్క్ చేసి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా షూట్ కొంతకాలం చేసినా అది వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా నాని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం సంథింగ్ స్పెషల్ త్వరలోనే వస్తుందని ఆయన ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ఏదో షూట్ చేసిన దానిని నాని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది.

natural star Nani Announces Something Special For Frontline Workers

నిజానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఉపాసన కొద్దిరోజుల క్రితం ఒక స్పెషల్ ఫిలిం చేస్తోందని ప్రచారం జరిగింది. ఆ విషయంలో క్లారిటీ లేదు కానీ ఇప్పుడు నాని పోస్ట్ చేసిన దానిని బట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఏదో చేస్తున్నట్టు ఉంది. పోస్ట్ లో మ్యూజిక్ సింబల్ కూడా పెట్టడంతో అదే అయ్యుండచ్చని అంటున్నారు. అయితే మొత్తం మీద మాత్రం నాని ఫ్రంట్లైన్ కార్మికులను ఉత్సాహపరిచేందుకు ఒక స్పెషల్ అంశంతో వస్తున్నాడని మాత్రం చెప్పచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X