For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Navarasa Web Series Download: మేకర్స్ కి షాక్.. క్షణాల్లో హెచ్‌డీ క్వాలిటీ మూవీ లీక్!

  |

  స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరస ఎట్టకేలకు నేడు (ఆగస్టు 6) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, సతీష్ కుమార్, పార్వతి, రేవతి, అథర్వ మురళి మరియు అంజలి నటించిన ఈ వెబ్ సిరీస్ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీం అవుతుంది. ఊహించినట్టుగానే, ఈ ఆంథాలజీ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన మరియు ప్రేక్షకులు, విమర్శకుల నుండి అనుకూలమైన సమీక్షలు వస్తున్నాయి. 'నవరసాలు' కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సిరీస్ లో తొమ్మిది ప్రత్యేక కథనాలు ఉన్నాయి.

  కరుణ, ధైర్యం, శృంగారం, హాస్యం, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో ఎపిసోడ్‌ గా తెరకెక్కించారు. తొమ్మిది మంది ప్రముఖ డైరెక్టర్లు ఒక్కో ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించడం గమనార్హం. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నుంచి 40 నిమిషాలు నిడివితో ఉంది.

  మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ సినిమా టెక్నాలజీస్ కింద రత్నం, జయేంద్ర పంచపాకేశన్ దీనిని నిర్మించారు. అలాగే అరవింద్ స్వామి, బాబీ సింహా, సనంత్, శ్రీరామ్, రోహిణి, ప్రయాగ మార్టిన్, ఢిల్లీ గణేష్, రమ్య నంబీసన్, కిషోర్, అమ్ము అభిరామి, వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ మలయాళం 3 విజేత మణికుట్టన్ ప్రముఖ పాత్రలలో నటించారు.

  Navarasa Full Web Series Download From Tamilrockers In Telugu

  సూర్య నటించిన ఈ టీజర్ మరియు ట్రైలర్ వరుసగా జూలై 9 అలాగే 27న విడుదలయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ యొక్క అధికారిక ఎమోజి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో (సిరీస్ కేటగిరీ) మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కరోనా మహమ్మారి కారణంగా తమిళ పరిశ్రమ షట్‌డౌన్ అయినందున దానికి ప్రభావితమైన FEFSI (ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) టెక్నీషియన్‌లకు నవరసకు సంబందించిన లాభాలు అందుతాయి.

  ఇలా ప్రముఖ హీరోలంతా ఇలా వెబ్‌సీరిస్‌లో కనిపించడం వెనుక ఒక ఇదే అసలు కారణం. ఈ సిరీస్ డిజిటల్ రిలీజ్ అనుకున్నప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడం గమనార్హం. అలా చేసిన ప్రచారంలో ఒకటి దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా మీద నవరసను ప్రమోట్ చేయడమే. దుబాయ్‌లో నవరస సినిమా ప్రకటన నిన్న రాత్రి నుండి లైట్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. వెబ్‌సైట్‌లలోని ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

  'నవరస'లో తొమ్మిది భాగాలు ఉన్నప్పటికీ సూర్య పాత్ర పై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మరియు సూర్య మరియు ప్రయాగ మార్టిన్ నటించిన భాగం 'గిటార్ స్ట్రింగ్ స్టాండ్ అప్' పేరుతో విడుదల అయింది. సంగీత ప్రియుడు సూర్య కోసం ఒక మహిళ తన జీవితాన్ని ఎలా మార్చుకుంటుందనేది ఈ పార్ట్ కథ. అయితే ఈ సిరీస్ విడుదల అయిన క్షణాల్లోనే లీక్ కావడం మేకర్స్ కి టెన్షన్ పెడుతోంది. ఈ సిరీస్ తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. టెలిగ్రామ్, మూవీ రూల్జ్, తమిళ రాకర్స్ సహా ఇతర పైరసీ ఆధారిత వెబ్‌సైట్‌లలో నవరస లీక్ చేయబడింది. ఇంకేముంది తమిళ సినిమా అభిమానులు ఈ విషయం మీద ఫైర్ అవుతున్న్రారు.

  English summary
  Star director Mani Ratnam's ambitious Navarasa has finally been released on Netflix today (August 6). as soon as the series was released, leaked online. Navarasa has been leaked on other piracy based websites including Telegram, Movie Rule, Tamil Rockers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X