బాలయ్యను ఢీకొట్టడానికి రెడీ అయిన యంగ్ హీరో.. ఎన్టీఆర్ తర్వాత ఇదే!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ సూపర్ హిట్ల తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు రోల్ కాగా, ఇంకోటి అఘోరా పాత్ర అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పలానా నటుడు, నటి కీలక పాత్రలు పోషిస్తున్నారని రోజుకో వార్త తెరపైకి వస్తోంది. ఇందులో భాగంగానే ఈ భారీ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నాడని ఆ మధ్యనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై క్లారిటీ అయితే రాలేదు కానీ.. ఇందులో అతడు పొలిటికల్ లీడర్ కుమారుడి పాత్రను పోషిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

 Naveen Chandra Negative Role in Balakrishna Movie

అంతేకాదు, అది ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాలో నవీన్ చంద్ర నెగెటివ్ రోల్ చేశాడు. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఆ మూవీ తర్వాత మరోసారి నందమూరి హీరో సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ విలన్‌గా చేస్తున్నాడని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో నటించే హీరోయిన్ విషయంలోనూ ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇక, ఈ మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X