For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nayanathara: భర్త కంటే ఎక్కువ ఆస్తి.. ఆ విషయంలో జాక్ పాట్ కొట్టేసిన విగ్నేష్ శివన్!

  |

  గ్లామర్ బ్యూటీ నయనతార ఇటీవల తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట మొత్తానికి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇక వీరికి సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆస్తి విషయంలో మాత్రం నయనతార భర్త కంటే కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉన్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే విగ్నేష్ ఆస్తి విలువ ఎంత అన్న విషయంలో కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఎలాంటి పొరపాటు లేకుండా

  ఎలాంటి పొరపాటు లేకుండా


  మంచి నటిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపును అందుకున్న నయనతార పర్సనల్ లైఫ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా సినిమా కెరీర్ విషయం లో మాత్రం ఆమె చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. పర్సనల్ లైఫ్ ను సినిమా కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఆమె చాలా నిలకడగా కొనసాగింది అనే చెప్పాలి. ఇంతకుముందు రెండుసార్లు ప్రేమలో విఫలమైనప్పటికీ మూడోసారి మాత్రం ఆమె ఎలాంటి పొరపాటు జరగకుండా సరికొత్త జీవితాన్ని ఆరంభించింది.

  ఆస్తిని లెక్క చేయకుండా

  ఆస్తిని లెక్క చేయకుండా

  దర్శకుడు విగ్నేష్ శివన్ తమిళ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే మంచి గుర్తింపును అందుకుంటున్న సమయంలోనే నయనతార ఎంతగానో ఇష్టపడింది. అతని ఆస్తి విలువ స్థాయి ఏమిటి అనేది ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. అతను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు అతనితో తన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే ఆమె ఎక్కువగా ఆలోచించింది.

  గొడవలు జరిగినా..

  గొడవలు జరిగినా..

  ఐదేళ్ల ప్రయాణంలో విగ్నేష్ తో మధ్యలో కూడా కొన్ని విభేదాలు వచ్చినట్లు తమిళ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయాలపై నయనతార ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోలేదు. సాధారణంగా చిన్నచిన్న గొడవలు జరిగినా కూడా అది కూడా ప్రేమలో భాగంగానే ఆమె ముందుకు సాగింది. విగ్నేష్ ను మాత్రం ఆమె పెళ్లి చేసుకోవాలని మొదట్లోనే డిసైడ్ అయినట్లు ఒక ఇంటర్వ్యూలలో తెలియజేసింది.

  నయన తార ఆస్తి విలువ

  నయన తార ఆస్తి విలువ

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకున్న నయనతార ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఒక్కో సినిమాకు ఆమె కోట్లలోనే పారితోషికం వస్తోంది. దీంతో ఆమె ఆస్తి విలువ 170 కోట్లకు పైగానే ఉంటుంది అని అయితే ఉంది.

   విగ్నేష్ ఆస్తి విలువ?

  విగ్నేష్ ఆస్తి విలువ?

  ఇక విగ్నేష్ మాత్రం ఆస్తి విషయంలో పెద్దగా ఉన్నతమైన వ్యక్తి ఏమీ కాదు. నయనతార మాత్రం అతడు చాలా మంచి మనసున్న వ్యక్తి అని మాత్రమే ప్రేమించింది. ఇక దర్శకుడిగా మారిన తర్వాత అతను కాస్త బాగానే నిలదొక్కుకున్నాడు. కొన్ని విజయాలతో తన పారితోషకం కూడా పెరిగింది కాబట్టి అతని ఆస్తి విలువ 50 కోట్ల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చట. అది కూడా నయన తార అతని జీవితంలోకి వచ్చిన తరువాతనే అతని ఆస్తి పెరిగిందని కథనాలు వెలువడుతున్నాయి.

  Recommended Video

  Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
  భర్త పేరు మీద ఇల్లు

  భర్త పేరు మీద ఇల్లు

  ఆస్తి విషయంలో మాత్రం భర్త కంటే నయనతార చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంది అంతే కాకుండా ఆమె ఖరీదైన బీఎండబ్ల్యూ కార్, ప్రైవేట్ జెట్ తో పాటు అనేక రకాల స్థలాలు కూడా ఉన్నాయి అయితే పెళ్ళి కానుకగా నయనతార స్వయంగా తన భర్త పేరు మీద ఒక బంగ్లాను కూడా రాసి ఇచ్చింది. వారిద్దరు కూడా అదే ఇంట్లో ఉండేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

  English summary
  Nayanathara and vignesh shivan assets value differences
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X