For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NBK107: బాలయ్య సినిమాకు వీసా చిక్కులు.. ప్లాన్ మార్చేసిన మూవీ యూనిట్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. పేరుకు బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారాయన. అంతేకాదు, అన్ని జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దీంతో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య చాలా కాలం పాటు బాలయ్యకు హిట్ మాత్రం సొంతం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు, బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది.

  మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

  'అఖండ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్న గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీనికోసం గోపీచంద్ ప్రకాశం జిల్లాలోని లైబ్రెరీలలో ఉన్న పాత పేపర్లను కూడా ఆధారంగా తీసుకున్నాడు. ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. ఇక, ఫిబ్రవరి నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూట్ మొదలైంది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది.

  NBK107: Balakrishna and Team to fly turkey for New Schedule

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడిపోయింది. ఇక, ఇప్పుడు బాలయ్య దాని నుంచి కోలుకోవడంతో త్వరలోనే దీన్ని పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన షెడ్యూల్‌ను కంప్లీట్ చేయబోతున్నారట. ఆ వెంటనే మరో కొత్త షెడ్యూల్‌ను కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను అమెరికా నుంచి టర్కీకి మార్చేశారట. దీనికి కారణం యూనిట్‌లోని చాలా మంది సభ్యులకు అమెరికా వీసా సమస్య తలెత్తిందట. దీంతో చిత్ర యూనిట్ షెడ్యూల్‌ను టర్కీ దేశానికి మార్చేసిందని అంటున్నారు. అక్కడ జరిగే షూటింగ్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. ఇందుకోసం బాలయ్యతో పాటు యూనిట్ సభ్యులు మరికొన్ని రోజుల్లోనే టర్కీ ఫ్లైట్ ఎక్కబోతున్నారని సమాచారం.

  నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, దీని నుంచి వచ్చిన టీజర్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Nandamuri Balakrishna Announced his 107th Film with Gopichand Malineni. Balakrishna and Team to fly turkey for This Movie New Schedule.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X