twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌పై నెటిజన్ల ప్రశంసలు.. తుఫాన్ బాధితులను బాహుబలి అండ.. ఏపీకి భారీ విరాళం

    |

    బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి ప్రజల మనసును గెలుచుకొన్నారు. తుఫాన్ తాకిడితో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకొనేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. గత కొద్దివారాలుగా తుఫాన్ తాకిడి, వరదలకు తిరుపతి, ఇతర నగరాలలో జన జీవనం స్తంభించింది. దాంతో ప్రజా జీవితం రోడ్డుపాలై దీనావస్థకు చేరుకొన్నది. దాంతో వరద, తుఫాన్ బాధితులను ఆదుకోనేందుకు భారీ సహాయాన్ని అందించారు.

    గతంలో కూడా ప్రభాస్ భారీ ఆర్థిక సహాయంతో ముందుకొచ్చారు. ఏప్రిల్ 2020‌లో హైదరాబాద్‌లో తుఫాన్ పరిస్థితులు, అలాగే లాక్‌డౌన్ కారణంగా అస్తవస్తమైన పేదల జీవితాలను ఆదుకొనేందుకు రూ.4.5 కోట్లు విరాళం ప్రకటించారు.

    Netizens praises Prabhas over donation of Rs.1 crore to the APCMRF

    తాజాగా ఏపీలో వరద బాధితులను ఆదుకొనేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. టాలీవుడ్‌లో అత్యధికంగా విరాళం ప్రకటించిన హీరోలలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే ప్రభాస్ విరాళం ప్రకటించిన వెంటనే తన అభిమానులు, సినీ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మానవత్వాన్ని ప్రదర్శిస్తూ బాధితులను ఆదుకోవడంపై అభినందనలు తెలుపుతున్నారు. ప్రభాస్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

    బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే బాలీవుడ్‌లో ఆదిపురుష్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం షూటింగు జరుపుకొంటున్నది. అలాగే నాగ్ అశ్విన్ చిత్రం ప్రాజెక్ట్ కే కోసం సిద్దమవుతున్నారు.

    అయితే బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ సుమారు రూ.150 కోట్ల రూపాయల పారితోషికం అందుకొన్నారనే విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ రూపొందించే స్పిరిట్ సినిమా కోసం కూడా భారీగా పారితోషికం అందుకొన్నట్టు తెలుస్తున్నది.

    English summary
    Prabhas emerges as a Bahubali to the public, as he makes a donation of Rs 1 crore to the Andhra Pradesh Chief Minister’s Relief Fund to help flood victims in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X