Don't Miss!
- News
ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఓటీటీలో నితిన్, రానా.. వరుసగా రాబోతున్న తెలుగు హీరోల ఇంట్రెస్టింగ్ మూవీస్
ఒక సినిమా చూడడానికి ఈ రోజుల్లో థియేటర్స్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.. అనే డైలాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో నెలలు గడిస్తే గాని టీవీల్లో చూసే అవకాశం కుదురేది కాదు. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం ఎక్కువయ్యిందో అప్పటి నుంచి వరుసగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా స్టార్స్ సినిమాలు చాలా ఫాస్ట్ గా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో మరికొన్ని సినిమాలు ముందుగానే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
గ్లామరస్ లో కొత్త అర్ధలు చూపిస్తున్న వర్ష.. కళ్లతోనే చంపేస్తోంది!

నితిన్ డబుల్ ధమాకా..
యువ హీరో నితిన్ ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా థియేటర్స్ నుంచి వెళ్లిపోతున్నాడు. ఇటీవల విడుదలైన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఇక చెక్ సినిమా మే రెండవ వారంలో సన్ NXTలో ప్రసారం కానుంది. ఇక కీర్తి సురేష్ తో నటించిన రంగ్ దే ఆ తరువాతి వారం జీ5లో విడుదల కానుంది.

రానా పాన్ ఇండియా మూవీ
ఇక రానా దగ్గుబాటి ఎంతో నమ్మకంతో చేసిన పాన్ ఇండియా మూవీ అరణ్య బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. డిజిటల్ రైట్స్ ద్వారానే సినిమా నిర్మాణ సంస్థ నష్టాల నుంచి తప్పించుకుంది. ఇక మే రెండవ వారంలో ఈ సినిమా జీ5లోకి రానుంది.

సందీప్ కిషన్ మూవీ కూడా..
ఇక యువ హీరో సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన A1 ఎక్స్ ప్రెస్ మార్చి 5న వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బజ్ అయితే బాగానే క్రియేట్ చేసింది గాని కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా సన్ NXTలో మే 1న రిలీజ్ కానుంది.
Recommended Video

డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో ధనుష్ మూవీ
కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ నటించిన తమిళ మూవీ జగమే తందిరామ్ ను తెలుగులో డబ్ చేశారు. ఇక ఆ సినిమా జగమే తంత్రంగా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. జూన్ 18న రిలీజ్ కాబోతోంది. అలాగే ధనుష్ ఇటీవల నటించిన కర్ణన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.