Nithiin's Check movie థియేటర్‌లో ఫ్లాప్.. బుల్లితెరపై హిట్.. చెక్ మ్యాజిక్ చేసింది అలా!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్ బ్యానర్‌పై నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం చెక్. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే తాజాగా చెక్ మూవీని టెలివిజన్ ప్రసారం చేయగా మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమైన చెక్ మూవీకి రూరల్ ప్రాంతంలో 8.53 రేటింగ్ సొంతం చేసుకోగా, అర్బన్ ప్రాంతంలో 6.95 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో టెలివిజన్‌లో టాలీవుడ్ మూవీ ఈ రేంజ్ రేటింగ్‌ను అందుకోవడం అరుదుగా కనిపించింది. దాంతో బుల్లితెరపైన హిట్ అనే టాక్‌ను సొంతం చేసుకొన్నది.
టెర్రరిజం, హానీ ట్రాప్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, కథనాలు చంద్రశేఖర్ ఏలేటి స్థాయిలో లేదనే మాట వినిపించినా.. రెండు గంటలపాటు సినిమాపై ఆసక్తిని కలిగించేలా చిత్రీకరించారు అని కొన్ని వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు
రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
నిర్మాత: వీ ఆనంద ప్రసాద్
మ్యూజిక్: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటింగ్: సనల్ అనిరుధన్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
రిలీజ్: 2021-02-26


Click it and Unblock the Notifications











