నిన్నేమో అలా ఈరోజేమో ఇలా.. షాలినితో నితిన్ ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్
Recommended Video

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ లిస్ట్ నుంచి ఓ పేరు తక్కువైంది. యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ఈ మేరకు పెళ్లి తతంతగమంతా మొదలైంది. నేడు (ఫిబ్రవరి 15) నితిన్ ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ప్రేమ పెళ్లి..
యూఎస్‌కి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ శాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ యంగ్ హీరో. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా నితిన్ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగానే నేడు నిశ్చితార్థం జరిగింది.

పెళ్లి పనులన్నీ ఆమె చేతుల మీదుగానే..
ప్రేమ పెళ్లే అయినా.. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని ఏప్రిల్‌లో జరుపబోతోన్నట్లు తెలుస్తోంది. ఇంకా తేదీని నిర్ణయించలేదు. నితిన్ పెళ్లికి సంబంధించిన పనులన్నింటిని నితిన్ అక్క.. నిర్మాత నిఖితా రెడ్డి దగ్గరుండి చూసుకుంటోంది.

కుటుంబ సభ్యుల మధ్యే..
ఈ నిశ్చితార్థపు వేడుకలు పూర్తి ఇరు కుటుంబాల మధ్యే జరిగింది. ఈ ఈవెంట్‌కు సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరికీ పిలుపు వెళ్లలేదని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు, బంధువులు, సపరివారమంతా హాజరైనట్టు తెలుస్తోంది.
పెళ్లి పనులు మొదలయ్యాయి..
పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్.. మీ బ్లెస్సింగ్స్ కావాలని సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్య ఫోటోను , నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. నితిన్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పెళ్లి పనులు మొదలయ్యాయి..
పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్.. మీ బ్లెస్సింగ్స్ కావాలని సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్య ఫోటోను , నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. నితిన్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

న్నిన్నేమో అలా..
భీష్మ సింగిల్ ఆంథమ్ అంటూ నిన్న హల్ చల్ చేశాడు.. ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదని నేడేమో ఇలా నిశ్చితార్థం చేసేసుకున్నాడంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అంటూ సెలెబ్రిటీలు నితిన్‌ను విష్ చేస్తున్నారు.

డెస్టినేషన్ వెడ్డింగ్..
ఈ మధ్య సినీ స్టార్స్ అంత తమ వివాహాలు డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేసుకుంటున్నారు. నితిన్ కూడా అదే బాటలో చేరనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లాంటి అత్యంత ఖరీదైన నగరంలో ప్లాన్ చేశాడని తెలుస్తోంది. చూడాలి మరి.. ఆ వేడుక ఇంకెంత ఘనంగా జరుగుతుందో.


Click it and Unblock the Notifications











