For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నడి సముద్రంలో ఎన్టీఆర్ వేట.. ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా విభిన్నమైన చిత్రాలతో క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం)తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగి తన రేంజ్‌ పెంచుకున్నాడు. దీనికితోడు ప్రపంచం దృష్టినీ లాక్కున్నాడు.

  హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

  జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. కానీ, ఈ మూవీ మాత్రం అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వేట మొదలెట్టడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేసి త్వరలోనే మొదలెట్టబోతున్నట్లు చెప్పారు. ఇక, న్యూ ఇయర్ రోజు ఏకంగా ఈ మూవీని రిలీజ్ చేయబోయే డేట్‌నే ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

  NTR and Koratala Movie First Schedule on The Sea Set

  'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం.. ఫస్ట్ షెడ్యూల్‌ను సముద్రం సెట్‌లో చిత్రీకరించబోతున్నారట. ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా ఇందులో ఎన్టీఆర్ సాహసాలు చేయబోతున్నాడని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతోన్నాయి.

  Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

  NTR and Koratala Movie First Schedule on The Sea Set

  ఎన్టీఆర్ హీరోగా కొరటాల తీసే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.

  English summary
  Tollywood Star Hero Jr NTR will do a film Under Koratala Shiva Direction. This Movie First Schedule to Start on The Sea Set.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X