For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ బయోపిక్ సంచలనం.. 100 ఫీట్ల బాలయ్య కటౌట్.. నటీనటుల పూర్తి జాబితా ఇదే..

  |

  తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతిని ఒక్కటి చేసిన గొప్ప నటుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. రెండో భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల దగ్గరపడుతున్న కొద్దీ అనే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అవేమిటంటే..

  రెండు భాగాలుగా ఎన్టీఆర్

  రెండు భాగాలుగా ఎన్టీఆర్

  తొలిభాగం కథానాయకుడులో ఎన్టీఆర్ బాల్యం, యవ్వనం, సినీ జీవితాన్ని తెరకెక్కించారు. ఇక రెండో భాగం మహానాయకుడులో స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ కానున్నది.

  హైదరాబాద్‌లో 100 ఫీట్ల కటౌట్

  హైదరాబాద్‌లో 100 ఫీట్ల కటౌట్

  ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్న నందమూరి బాలకృష్ణకు అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 100 ఫీట్ల ఎత్తైన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కాషాయ దుస్తుల్లో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎన్టీఆర్ ఫొటో ప్రస్తుతం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నది.

   రెండోసారి క్రిష్, బాలకృష్ణ

  రెండోసారి క్రిష్, బాలకృష్ణ

  ఎన్టీఆర్ బయోపిక్‌ కోసం హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండోసారి జతకలిశారు. గతంలో క్రిష్‌తో కలిసి గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో బాలయ్య నటించారు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అనూహ్యమైన విజయం సాధించడం కూడా తెలిసిందే.

  ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది వీరే..

  ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది వీరే..

  • నందమూరి తారక రామారావు: బాలకృష్ణ
  • బసవ రామ తారకం: విద్యా బాలన్
  • నందమూరి త్రివిక్రమరావు: దగ్గుబాటి రాజా
  • నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్
  • లోకేశ్వరి : పూనమ్ బజ్వా
  • భువనేశ్వరి : మంజిమా మోహన్.
  • సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్
  • పురంధేశ్వరి : హిమన్సీ
  • ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి
  • నందమూరి రామకృష్ణ : రోహిత్ భరద్వాజ్.
  • అక్కినేని నాగేశ్వరరావు : సుమంత్
  • రామోజీరావు : గిరీష్
  • ఎస్వీ రంగారావు : ఈశ్వర్ బాబు
  • నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా
  • మండలి వెంకట కృష్ణా రావు : మండలి బుధప్రసాద్.
  • హెచ్ ఎం రెడ్డి : కైకాల సత్యనారాయణ
  • దాసరి నారాయణ రావు : చంద్ర సిద్ధార్థ్.
  • రేలంగి : బ్రహ్మానందం
  • నాగిరెడ్డి : ప్రకాష్ రాజ్
  • ఆలూరి చక్రపాణి : మురళీ శర్మ
  • ఎల్వి ప్రసాద్ : జిషు సేనుగుప్త
  • శ్రీదేవి : రకుల్ ప్రీత్ సింగ్
  • నాదెండ్ల భాస్కరరావు : సచిన్ ఖేదేకర్
  • బి ఏ సుబ్బారావు : నరేష్
  • పీ పుల్లయ్య : శుభలేఖ సుధాకర్
  • కే వీ రెడ్డి : క్రిష్ జాగర్లమూడి
  • పీతాంబరం : సాయి మాధవ్ బుర్రా
  • బి విఠలాచార్య : ఎన్ శంకర్
  • కృష్ణ కుమారి : ప్రణీత సుభాస్
  • వెంపటి చిన సత్యం : శివ శంకర మాస్టర్
  • సావిత్రి : నిత్యామీనన్
  • జయప్రద : హన్సిక మోత్వాని
  • ప్రభ : శ్రీయ
  • జయసుధ : పాయల్ రాజపుత్
  • యోగానంద్ : రవిప్రకాష్
  • తాతినేని ప్రకాష్ రావు : ఇంటూరి వాసు
  • టీ వెంకటరాజు : సురభి జయ చంద్ర
  • పేకేటి శివరాం : భద్రం
  • షావుకారు జానకి : షాలిని పాండే
  • పింగళి : సంజయ్
  • మార్కస్ బార్ట్లే : అర్జున ప్రసాద్
  • గుమ్మడి : దేవీ ప్రసాద్
  • జీ వరలక్ష్మీ : ప్రత్యూష
  • పుండరీకాక్షయ్య : నాగేశ్వరరావు
  • కమలాకర్ కామేశ్వర రావు : ఎస్వీ కృష్ణారెడ్డి
  • ఇందిరాగాంధీ : సుప్రియా వినోద్
  • సీ నారాయణరెడ్డి : రామజోగయ్య శాస్త్రి
  • ఎమ్ జి రామచంద్రన్ : సికిందర్
  • కన్నప్ప : సునీల్ కుమార్ రెడ్డి
  • డీ వీ నరసరాజు : శ్రీనివాస్ అవసరాల
  • కె రాఘవేంద్రరావు : కె ప్రకాష్
  • సలీం మాస్టర్ : రఘు మాస్టర్
  • దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి
  • చల్మేశ్వర్ రావు : నాగరాజ్
  • రూఖ్మాంగధరావు : వెన్నెల కిషోర్
  English summary
  Nandamuri fans have erected a 100-feet cut-out of Balakrishna in Hyderabad. Balayya, who is playing his father in the biopic, is seen in an orange attire. The humongous cut-out seems to have caught the attention of movie buffs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X