Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 2 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 4 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజు గారి గది 3 ఫస్ట్ టాక్: కథంతా దాని చుట్టే!
డిఫెరెంట్ జానర్‌లో 'రాజు గారి గది' సిరీస్ ద్వారా హారర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు ఓంకార్. తాజాగా ఈ సిరీస్ నుంచి 'రాజు గారి గది 3' సినిమా విడుదల చేశాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ విశేష ఆదరణ తెచ్చుకోవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. యు/ఏ సెన్సార్ సర్టిఫికేట్ తో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ టాక్ చూస్తే..

ఓవర్సీస్‌లో షోస్.. రెస్పాన్స్ ఎలా ఉందంటే
ఓవర్సీస్‌లో 'రాజు గారి గది 3' చిత్రాన్ని ఫార్స్ ఫిలిమ్స్ విడుదల చేసింది. ఈ రోజే (అక్టోబర్ 18న) విడుదల కానున్న ఈ సినిమాను యూఎస్ ప్రేక్షకులు గత రాత్రే చేసేశారు. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఫస్ట్ టాక్‌ని బట్టి చూస్తే.. 'రాజు గారి గది 3' కొంతమేర పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నట్లే తెలుస్తోంది.

థ్రిల్లర్ మూవీ.. గత సినిమాలతో పోల్చితే
'రాజు గారి గది' సిరీస్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలతో పోల్చితే కంటెంట్ పరంగా 'రాజు గారి గది 3' సినిమా సూపర్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదో అద్భుతమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అని అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు.

హారర్ కామెడీ.. కథ అంత దాని చుట్టే
'రాజు గారి గది 3' సినిమాలో హారర్‌తో కామెడీ పుష్కలంగా ఉందని అంటున్నారు జనం. పాత బంగ్లాలో జరుగుతున్న వరుస సంఘటనల చుట్టే ఈ కథ అంతా తిరిగిందని, ఓంకార్ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుందనే టాక్ బయటకొచ్చింది. రివ్యూ రైటర్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు.

పాజిటివ్ పాయింట్స్ ఇవే..
'రాజు గారి గది 3' సినిమాకు ఓంకార్ డైరెక్షన్ వర్క్ సూపర్‌గా ఉందని, స్క్రీన్ ప్లే వర్క్ అద్భుతంగా ఉందని అంటున్నారు జనం. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ఇవే సినిమాకు పాజిటివ్ పాయింట్స్ అని తెలుస్తోంది.

నెగెటివ్ పాయింట్స్ ఇవే..
ఇక ఈ సినిమాలో నెగెటివ్ పాయింట్స్ అంటే.. నిర్మాణ విలువలు పూర్‌గా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అంత బాగా లేదని, సంగీతం యావరేజ్ అనే టాక్ జనం నుంచి వినిపిస్తోంది.

రాజు గారి గది 3
హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజు గారి గది 3 సినిమా నిడివి కేవలం రెండు గంటలే. చిత్రంలో అవికా గోర్, అశ్విన్ బాబు, ఓంకార్ కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి చోటా కె నాయుడు, గౌతమ్ రాజు, సాయి మాధవ్ బుర్ర వంటి టాప్ టెక్నీషియన్స్‌గా పనిచేశారు.