మొదటికొచ్చిన ఇండియన్ 2 గొడవ: రామ్ చరణ్ సినిమాపై మరోసారి ఫ్రస్టేషన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో RRR అనంతరం నెవర్ బిఫోర్ అనేలా సినిమాలు రానున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఒక సినిమా తరువాత మరొక సినిమా పాన్ ఇండియా స్థాయిని కూడా పెంచబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్, శంకర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాపై మరోసారి ఫ్రస్టేషన్ ను కలిగించే న్యూస్ వైరల్ గా మారింది.

ఇంతవరకు సరైన విజయాన్ని చూడలేదు
సంచలన దర్శకుడు శంకర్ తన సినీ జీవితంలో చాలా కాలం తరువాత ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోబో సినిమా తరువాత ఇంతవరకు సరైన విజయాన్ని చూడలేదు. స్నేహితుడు , ఐ పరవాలేదు అనిపించినప్పటికి ఆయన స్థాయికి తగ్గట్లు మాత్రం హిట్టవ్వలేదు. అనంతరం 2.ఓ అయితే మరింత దెబ్బ కొట్టింది.

సినిమాను హోల్డ్ లో పెట్టడంతో
2.ఓ సినిమాకు పెద్దగా నష్టం రాలేదు. నిర్మాతలు తృటిలో నష్టాల నుంచి తప్పించుకున్నారు. ఇక లైకా ప్రొడక్షన్ అయిష్టంగానే ఇండియాన్ 2 సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక శంకర్ అదే కాన్ఫిడెన్స్ తో బడ్జెట్ ను పెంచుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. లైకా సంస్థ కరోనా వలన సినిమాను హోల్డ్ లో పెట్టడంతో అప్పటి నుంచి షూటింగ్ కదలడం లేదు.

మరో రెండు వారాలకు వాయిదా
దర్శకుడు శంకర్ చర్చలతోనే సినిమాను ఫినిష్ చేయాలని అనుకున్నడు. కానీ లైకా బడ్జెట్ విషయంలో కండిషన్ పెట్టడం, రెమ్యునరేషన్ తగ్గించడం వంటివి ఏ మాత్రం నచ్చలేదు. కోర్టుకు వెళ్లగా మీరే తేల్చుకోవాలని చెప్పారు. చర్చలు జరిపినప్పటికి సొల్యూషన్ దొరకకపోవడంతో మళ్ళీ కోర్టు వరకు వెళ్లారు. ఇక ఇటీవల ఇరువురి వాదనలను విన్న కోర్టు కేసు తీర్పును మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
Recommended Video

మరో కన్ఫ్యూజన్.. ఫ్రస్టేషన్
ఇండియన్ 2 లెక్క తేలితే గాని శంకర్ మరో సినిమాను స్టార్ట్ చేయడానికి వీలు లేదు. దీంతో రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ పై మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఇప్పట్లో సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం లేదని అభిమానులు కూడా ఫ్రస్టేట్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ RRR అనంతరం శంకర్ లాంటి దర్శకుడితో సినిమా చేయగలిగితే తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్ ను కాపాడుకోవచ్చని అనుకుంటున్నాడు. మరి ఈ వివాదంతో చరణ్ వేరే దర్శకుడిపై ఫోకస్ పెడతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











