Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆగని సర్కారు వారి పాట లీక్స్.. ఈసారి ఏకంగా ట్రైలర్.. సోషల్ మీడియాలో ఆ సీన్ వైరల్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన మరో చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా కు సంబంధించినవి ఏవైనా అఫీషియల్ గా విడుదల చేయకముందే సోషల్ మీడియాలో లీక్స్ అవుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా లీక్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ పాత్రలో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నాడు.
Recommended Video


ముందే సోషల్ మీడియాలో లీక్
సర్కారు వారి పాట తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఇదివరకే కొన్ని అప్డేట్స్ తో క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అఫీషియల్ గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి.

సోషల్ మీడియాలో లీక్
పాటలు అలా లీక్ కావడంతో ఆ విషయంపై సంగీత దర్శకుడు థమన్ కాస్త అప్సెట్ అయ్యాడు. మరొకసారి ఇలాంటి పొరపాటు ఏమాత్రం జరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అన్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్లీ లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి.. థమన్ చెప్పిన తర్వాత మరొక పాట కూడా అఫీషియల్గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది.

ట్రైలర్ కూడా
ఇక సోమవారం రావాల్సిన ట్రైలర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా మహేష్ బాబు చేతిలో తాళాల గుత్తి పట్టుకునే విలన్స్ ను కొడుతున్న సీన్ వైరల్ గా మారుతోంది.

ఎందుకు ఇలా జరుగుతోంది?
ఒక్క సర్కారు వారి పాట విషయంలోనే ఇలా తరచుగా ఎందుకు జరుగుతోంది అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో కూడా అనేక రకాల సందేహాలను కలిగిస్తోంది. ఒకసారి లీక్ అయితే మరోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదు అని అనిపిస్తోంది. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోతే మొదటికే మోసం వస్తుంది అని రేపు సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కూడా విడుదలకు ముందే లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.