twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oscars 2023 nominations ఉత్కంఠకు తెర.. రేసులో RRR.. వేడుకను ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే!

    ప్రపంచ సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నది. భారత్ నుంచి నాలుగు సినిమాలు నామినేట్ కావడంతో ఏ సినిమా ఈ రేసులో అర్హత సాధిస్తుందనే వ

    |

    ప్రపంచ సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నది. భారత్ నుంచి నాలుగు సినిమాలు నామినేట్ కావడంతో ఏ సినిమా ఈ రేసులో అర్హత సాధిస్తుందనే విషయంపై అత్యంత ఆసక్తి నెలకొన్నది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 24వ తేదీన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ప్రకటన వెలువడుతుంది. ఈ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    భారత కాలమానం ప్రకారం ఎప్పుడంటే?

    భారత కాలమానం ప్రకారం ఎప్పుడంటే?

    ఆస్కార్ నామినేషన్ల ప్రకటన వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రిజ్ విల్సన్, అలిసన్ విలియమ్స్ నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. భారత కాలమానం ప్రకారం జనవరి 24వ మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంకా కొద్ది గంటల్లోనే ఏ సినిమా అవార్డు రేసులో నిలుస్తుందనే విషయం ఖాయమవుతుంది.

    ఆన్ లైన్ ద్వారా ఎలా చూడొచ్చంటే?

    ఆన్ లైన్ ద్వారా ఎలా చూడొచ్చంటే?


    ఆస్కార్ నామినేషన్ల ప్రకటన కార్యక్రమం ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఔత్సాహిక సినీ అభిమానులు నేరుగా ఆన్ లైన్ ద్వారా ఈ వేడుకను వీక్షించవచ్చు. ఈ వేడుకను ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా గానీ, ఆస్కార్ అవార్డులకు సంబంధించిన సోషల్ మీడియాలో గానీ, లేదా Oscar.com స్ట్రీమింగ్ ద్వారా కూడా ఈ వేడుకను వీక్షించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

     భారత్ తరఫున నాలుగు చిత్రాలు

    భారత్ తరఫున నాలుగు చిత్రాలు


    ప్రతిష్టాత్మక 95వ అకాడమీ అవార్డుల కోసం భారత్ తరఫున నాలుగు సినిమాలు నామినేట్ అయ్యాయి. అధికారికంగా ఛెల్లో షో అనే గుజరాతీ చిత్రం భారత్ తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఎంట్రీ సాధించింది. RRR సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) కేటగిరిలో అర్హత సాధించింది. ఇంకా ది ఎలిఫాంట్ విష్పర్ డాక్యుమెంటరీ విభాగంలో, ఆల్ ది బ్రీతెస్ ది బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్‌కు రేసులో ఉన్నాయి.

    రేసులో RRR నాటు నాటు పాట

    రేసులో RRR నాటు నాటు పాట


    RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ సాధిస్తుందా? అనే విషయం సామాన్యులకే కాదు. ఎన్టీఆర్, రాంచరణ్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో అర్హత సాధిస్తే.. ఇద్దరు హీరోలకు మంచి క్రేజ్ పెరగడమే కాకుండా విదేశీ వేదికలపై RRR, రాజమౌళి సత్తా చాటుతారని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

     రాజమౌళిపై అజయ్ దేవగణ్ ప్రశంసలు

    రాజమౌళిపై అజయ్ దేవగణ్ ప్రశంసలు


    ఆస్కార్ అవార్డుల నామినేషన్ ప్రకటన వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పందించారు. ముంబైలో ఓ వేడుకలో మాట్లాడుతూ.. రాజమౌళి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మన ఇండస్ట్రీ సినిమాలకు మంచి గుర్తింపు వస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. జేమ్స్ కామెరాన్ లాంటి నటులు రాజమౌళిని ప్రశంసిస్తున్నారంటే మామూలు విషయం కాదు అన్నారు.

    English summary
    The 95th Academy Awards 2023 nominations to be announced on January 24th. As per an official statement, the event will be aired on Tuesday at 5:30 am PST/8:30 am EST. As per Indian Standard Time (IST), it will air at 7 pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X