For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేతిలో రూపాయి లేదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. చెప్పుకోలేని కష్టాలు.. పరిణితి చోప్రా

  |

  సినిమా వాళ్ళకేంటి? అద్దాల మేడలు, ఆడీ కార్లు, విలాసవంతమైన జీవితం అనుకుంటారంతా. కానీ వాళ్లకు కూడా సాధారణ జనం లాగే కొన్ని సందర్భాల్లో చెప్పుకోలేని సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే అందరూ అవి చెప్పుకోలేరు కాబట్టి ఆ కష్టాలు బయటకు తెలియవు. కానీ తాజాగా బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా తనకు ఎదురైన ఆర్ధిక కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఆమె చెప్పిన ఆ విషయాలు వివరంగా చూద్దామా..

  గత నాలుగేళ్ళ క్రిందట నా పరిస్థితి

  గత నాలుగేళ్ళ క్రిందట నా పరిస్థితి

  2014 నుంచి 2015 సంవత్సరాల మధ్య కాలంలో తన పరిస్థితి చెప్పుకోలేనిదని అంటోంది పరిణితి చోప్రా. ఆ సమయంలో తాను నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో ఆర్ధిక కష్టాలు వెంటాడాయని ఆమె చెప్పింది. కనీసం రోజు వారి ఖర్చులు కూడా తీర్చుకోలేని స్థితికి తాను దిగజారి పోయానని, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొందని పరిణితి తెలిపింది.

   ఆర్ధిక కష్టాలతో డిప్రెషన్ లోకి

  ఆర్ధిక కష్టాలతో డిప్రెషన్ లోకి

  ఆర్ధిక కష్టాలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తనను తాను ఓ గదిలో బంధించుకునేదాన్ని అని, నిద్ర కూడా పట్టేది కాదని పరిణితి వెల్లడించింది. ఆ సమయంలో వచ్చిన కష్టాలు చెప్పుకోలేనివని ఒక్కమాటలో చెప్పేసింది పరిణితి. వారాల కొద్దీ ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపేదాన్నని, ఇక తన పని అయిపోయింది అనుకున్నానంటూ అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంది పరిణితి చోప్రా.

   అసలు కారణం అదే..

  అసలు కారణం అదే..

  తను ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా సినిమాలు వరుసగా ప్లాప్ కావడం, పైగా కొత్త అవకాశాలు రాకపోవడంతో తను ఆర్ధికంగా పడిన ఇబ్బందులు జీవితాంతం మర్చిపోలేనని పరిణితి చెప్పింది. అయితే మరీ ఈ దారుణ పరిస్థితి రావడానికి కారణం.. అప్పటికే తన దగ్గరున్న డబ్బుతో ఇళ్లు కొనడం, వేరే పెట్టుబడులు పెట్టేయడం వల్లనే అని చెప్పింది. ఉన్న డబ్బంతా అక్కడే పెట్టేయడం, వరుస పరాజయాలు తలుపు తట్టడం మూలంగా చేతిలో ఒక్క రూపాయి కూడా లేని జీవితం గడపాల్సి వచ్చిందని పరిణితి తెలిపింది.

  స్నేహితుల సపోర్ట్

  స్నేహితుల సపోర్ట్

  మానసిక ఆందోళనలో కూరుకుపోయిన నాకు ఆ సమయంలో స్నేహితుల సపోర్ట్ లభించిందని, వారి సహకారంతోనే తను కోలుకున్నట్టుగా పరిణితి తెలిపింది. మొత్తానికైతే ఏదోలా తిరిగి ట్రాక్ ఎక్కిన పరిణితి.. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెండితెరపై ఆఫర్స్ పెట్టేస్తూ ఖుషీ ఖుషీగా ఉంది.

   సైనా బయోపిక్‌లో పరిణితి

  సైనా బయోపిక్‌లో పరిణితి

  భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో పరిణితి చోప్రా లీడ్ రోల్ పోషిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌కు తీసుకున్నారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకోవడంతో పరిణితి రంగంలోకి దిగింది. 'సైనా' అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

  English summary
  Parineeti Chopra went through the darkest phase in her life during 2014-2015. Whether it was her personal life or professional life, everything was in the doldrums. In an interview with Film Companion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X