Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అవి చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. ఎంతో బాధగా ఉంది.. పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన
పరుచూరి పలుకులు అనే యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమా సంగతులు, సినిమా యాక్టర్ల విశేషాలు, సినీ విశ్లేషణలు ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు పరుచూరి గోపాలకృష్ణ. అయితే ఆయన తన తాజా వీడియోలో ఇటీవలే అకాల మరణం పొందిన కమెడియన్ వేణు మాధవ్ గురించి స్పందిస్తూ ఆవేదన చెందారు. వివరాల్లోకి పోతే..

వేణు మాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..
తెలుగు చిత్రసీమాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే వేణు మాధవ్ అకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు పలువురు సినీ ప్రముఖులు. వేణు మాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేణు మాధవ్ గురించి తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో మాట్లాడారు గోపాలకృష్ణ.

కేవలం టాలెంట్.. ఇంకేమీ లేదు
కమెడియన్‌గా వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించిన వేణుమాధవ్, తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడని పరుచూరి అన్నాడు. కేవలం టాలెంట్‌తో ఆయన అంతెత్తుకు ఎదిగాడని తెలిపారు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో డైలాగ్ డెలివరీతో గమ్మత్తు చేసే టాలెంట్ వేణు మాధవ్ సొంతమని ఆయన చెప్పారు. రాజమౌళి సినిమాల్లో సైతం తన బ్లాకు కామెడీకి ఎంతో పేరు వచ్చిందని అన్నారు.

చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు
'లక్ష్మీ' సినిమాకు గాను వేణు మాధవ్‌కి మంచి గుర్తింపు, అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలంగాణ శకుంతలతో కలిసి ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. వాటిని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు పరుచూరి గోపాలకృష్ణ. 'లక్ష్మీ' సినిమాలో వేణు మాధవ్ పండించిన కామెడీ తాలూకు క్లిప్పింగ్స్ టీవీలో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆయన చెప్పరు.

చాలా బాధగా ఉంది.. గుండె తరుక్కుపోతోంది
తెలుగు చిత్రపరిశ్రమలో ఇలా కమెడియన్స్ అంతా ఒకరి తరువాత ఒకరుగా కనుమరుగై పోతుండటం చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని పరుచూరి అన్నారు. చిన్న వయసులోనే వేణుమాధవ్ చనిపోవడం, ఆయన తల్లి తల్లడిల్లిపోవడం చూసి గుండె తరుక్కుపోతోందని చెబుతూ ఆవేదన చెందారు పరుచూరి.

చిన్న, పెద్ద అందరు నటులతో
వేణు మాధవ్ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు నటులతో ఎంతో స్నేహ భావంతో మెదిలేవారని ఆయన మరణానంతరం చాలామంది నటీనటులు చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వేణు మాధవ్ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.