ప్రముఖ జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతి: మెగా మేనల్లుడి స్పందన
తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఎన్నో సేవలందించిన పసుపులేటి రామారావు (70) మృతి చిత్రసీమలో విషాద ఛాయలు నింపింది. యూరిన్ ఇన్ఫెక్షన్‌కి గురైన ఆయన ఈ రోజు (మంగళవారం) ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతదేహాన్ని కృష్ణానగర్‌లో ఉన్న ఆయన సొంతింటికి తరలిస్తున్నారు.
సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు పసుపులేటి రామారావు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా పనిచేసిన ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు రచించిన ఓ మహా నిఘంటువు పసుపులేటి రామారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని నేటి యంగ్ హీరోల వరుకు అందరినీ ఇంటర్వ్యూలు చేసిన అనుభవం ఆయనకుంది.

పసుపులేటి రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ''పసుపులేటి రామారావు మరణవార్త చాలా బాధపెట్టింది. ఆయన మొదటిసారి 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పటి నుంచి నాకు వెల్ విషర్‌గా ఉంటూ కెరీర్ పరంగా మంచి చెడులు చెప్పేవారు. ఆయన లేనిలోటు పూరించలేనిది'' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











