పావలా శ్యామలకి అండగా మేమున్నాం.. ముందుకొస్తున్న టాలీవుడ్.. ఇంటికి వెళ్లి మరీ!

తెలుగులో ఉన్న అతి కొద్ది మంది లేడీ కమెడియన్స్ లో పావలా శ్యామల ఒకరు. తమదైన హావభావాలతో, డైలాగులతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె ప్రస్తుతం దీనస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే.. నటి కరాటే కళ్యాణి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో ఆమెకు పలు విధాలుగా సహాయం అందుతోంది. ఒక పక్క కరాటే కళ్యాణి పావలా శ్యామల కోసం ఫండ్ రైజింగ్ చేస్తుంటే మరోపక్క టాలీవుడ్ కి సంబంధించిన చాలామంది ఎవరికివారు ఆమె ఇంటికి వెళ్లి సహాయం చేస్తున్నారు.

తెలుగులో బాబాయ్ హోటల్, వర్షం, ఆంధ్రావాలా, గోలీమార్ వంటి సినిమాల్లో పావలా శ్యామల తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రావాలా సినిమాలో బ్రహ్మానందం కాంబినేషన్ లో ఆమె చేసిన సీన్ అలాగే గోలిమార్ సినిమాలో ఫోన్ సంభాషణ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

pawala shyamala getting help from tollywood

అలాంటి నటి ప్రస్తుతం వయోభారం కారణంగా ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. సుమారు మూడు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారని తెలుసుకున్న కరాటే కళ్యాణి ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు రావడంతో ఇప్పుడు శ్యామల కుటుంబానికి ఆర్థికంగా అండదండలు అందించినట్లయింది.

తాజాగా ఈ నగరానికి ఏమైంది , ఫలక్నామా దాస్, సఫారీ లాంటి సినిమాల్లో నటించిన నటుడు జీవన్ కుమార్ తాజాగా పావలా శ్యామల ఇంటికి వెళ్లి నిత్యావసరాలు అందించడమే కాక నగదు సహాయం కూడా చేసి వచ్చారు.. ఇక అలాగే ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు బంధువులు కూడా అమెరికా నుంచి సుమారు 50 వేల రూపాయలు పంపినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని జబర్దస్త్ ఆర్టిస్ట్ గుండు మురళి తీసుకెళ్లి ఆమెకు అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X