Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మొదటి సారి బుల్లితెరపై పవన్ కళ్యాణ్ కూతురు.. అలా సడన్‌గా వచ్చేసరికి ఎమోషనల్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత పెరిగినా కూడా సింపుల్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అలాగే ఆయన పిల్లలు కూడా సెలబ్రేటీ హోదాకు దూరంగానే ఉంటారు. ఒక హీరో ఫ్యామిలీకి చెందిన వారిలాగా ఉండకుండా డీసెంట్ ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.

అకిరా నందన్ అంటే..
పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ కు ఫ్యాన్ ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతని పుట్టినరోజున కూడా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి. అయితే అకిరా ఎన్నడూ కూడా మెగా ఫ్యామిలీ అని స్టైల్ గా తనను తాను ప్రజెంట్ చేసుకోడు. ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు.

సాధారణ భక్తులతో కలిసి..
పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే సింపుల్ గా ఉంటాడో అదే తరహాలో ఆయన పిల్లలు కూడా ఉంటారని తెలుస్తోంది. అకిరా నందన్, ఆద్య తల్లితో ఇటీవల తిరుపతి దేవస్థానంకు వెళ్ళినప్పుడు కూడా సాధారణ భక్తుల మాదిరిగానే దైవ దర్శనం చేసుకున్నారు. వారు అనుకుంటే వివిఐపి దర్శనం చేసుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా సాధారణ భక్తులతో కలిసి నడిచారు.

తల్లితో కలిసి..
ఇక అకిరా నందన్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించడు. కానీ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారాల కూతురు ఆద్య మాత్రం తల్లి రేణు దేశాయ్ తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. పాటలు పాడడమే కాకుండా అప్పుడప్పుడు యాక్టింగ్ స్కిల్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆద్య
ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా ఆద్య మొదటిసారి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో ప్రసరమవుతున్న డ్రామా జూనియర్స్ లో రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా విడుదలైన ప్రోమోలో నెక్స్ట్ ఎపిసోడ్ కు ఆద్య రానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
Recommended Video
రేణు దేశాయ్ ఎమోషనల్
ఇక ఆద్య రావడంతో రేణు దేశాయ్ కూడా కొంత ఎమోషనల్ అయ్యారు. నా బెస్ట్ డాటర్ అని ఆద్యను పొగిడేసింది. ఇక ఆద్య కూడా బెస్ట్ మదర్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవర్ స్టార్ అభిమానులు కూడా ఆ వీడియో చూసి పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.