#Pawanothsawam షురూ.. పవన్ ఫాన్స్ ప్లానింగ్ మాములుగా లేదుగా?

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయాయి క హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల మీద చూపించే ప్రేమలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్నా ? లేక పుట్టిన రోజు లేక ఇతర ఏదైనా సందర్భాలు ఉన్నా ఊరిలో కటౌట్లు లేపి, కేక్ కటింగ్ లు లాంటివి చేసి రచ్చ చేసేవారు.. కానీ ఇప్పుడు చాలా వరకు ఆ ట్రెండ్ తగ్గిందనే చెప్పాలి.. ఇప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి అలాగే కామన్ డీపీలు పెట్టి ట్రెండ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు..

పెద్ద స్టార్ల అభిమానులైతే ఒక నెల ముందు నుంచే పుట్టినరోజులు సంబంధించిన ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. చిరంజీవి నట వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటే వేదం అనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీన జరుపుకుంటారు.. అయితే ఆయన పుట్టిన రోజుకు సరిగ్గా యాభై రోజుల ముందు నుంచే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అనే హాష్ ట్యాగ్ సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లాన్ చేశారు.

 pawan kalyan fans planned pawanothsawam for pawan birthday

అంతేగాక జులై 14 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు పవనోత్సవం అంటూ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విశేషాలు, ఆయన సినీ రంగానికి చేసిన సేవ, అలాగే సామాజికంగా చేసిన సేవలను 50 రోజుల పాటు ఫ్యాన్స్ ప్రజల దృష్టికి తీసుకు రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన హరిహర వీరమల్లు అలాగే ఒక మలయాళం సూపర్ హిట్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X